📄 ePaper
Friday, July 31, 2026
📄 ePaper
HomeతెలంగాణRangareddyస్త్రీనిధి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా నాల్లపురం అరుంధతి వెంకట్ రెడ్డి విజయం

స్త్రీనిధి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా నాల్లపురం అరుంధతి వెంకట్ రెడ్డి విజయం

📰 Generate e-Paper Clip

*స్త్రీనిధి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా నాల్లపురం అరుంధతి వెంకట్ రెడ్డి విజయం*
ఫరూక్‌నగర్, ప్రజావాణి జూలై 30: ఫరూక్‌నగర్ మండలం నాగులపల్లి గ్రామానికి చెందిన నాల్లపురం అరుంధతి వెంకట్ రెడ్డి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల స్త్రీనిధి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఎన్నికై ఘన విజయం సాధించారు. ఇటీవల నిర్వహించిన జిల్లా ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై కేవలం రెండు ఓట్ల తేడాతో గెలుపొందడం విశేషంగా నిలిచింది.
గ్రామస్థాయి నాయకత్వంతో ప్రజాసేవను ప్రారంభించిన అరుంధతి వెంకట్ రెడ్డి ప్రస్తుతం ఫరూక్‌నగర్ మండల సమైక్య అధ్యక్షురాలిగా సేవలందిస్తున్నారు. మహిళా సంఘాల అభివృద్ధి, స్వయం సహాయక సంఘాల బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular