బెజ్జంకి, మే 15 (ప్రజావాణి)
సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ చేపట్టిన “సురక్షా నేత్ర” కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూర్, తోటపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. “ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానం” అని పేర్కొంటూ, సీసీ కెమెరాల ద్వారా నేరాలను త్వరగా గుర్తించడం, నిందితులను సులభంగా పట్టుకోవడం సాధ్యమవుతుందని,నేరాల నివారణలో కూడా ఇవి ఎంతో ఉపయోగపడతాయని వివరించారు.గ్రామ ప్రజలు సీసీ కెమెరాల సంరక్షణలో పోలీసులకు సహకరించాలని కోరారు. యువత మాదకద్రవ్యాలు, డ్రగ్స్ జోలికి వెళ్లవద్దని సూచిస్తూ, అవి యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా సమాజంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తాయని హెచ్చరించారు.సురక్షా నేత్ర” కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అభినందిస్తూ, గ్రామాలను మరింత సురక్షితంగా మార్చేందుకు పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు. కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామ పెద్దలు, దాతలు, గ్రామ ప్రజలు, అలాగే వడ్లూర్, తోటపల్లి గ్రామ సర్పంచులకు బెజ్జంకి ఎస్సై ప్రత్యేక అభినందనలు తెలిపారు.




