“సురక్షా నేత్ర”తో గ్రామాల్లో భద్రత పెంపు వడ్లూర్, తోటపల్లిలో సీసీ కెమెరాల ప్రారంభించిన ఎస్సై తోట తిరుపతి
బెజ్జంకి, మే 15 (ప్రజావాణి) సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ చేపట్టిన “సురక్షా నేత్ర” కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని వడ్లూర్, తోటపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బెజ్జంకి ఎస్సై తోట తిరుపతి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. “ఒక్క కెమెరా 100 మంది పోలీసులతో సమానం” అని పేర్కొంటూ, సీసీ కెమెరాల ద్వారా నేరాలను త్వరగా గుర్తించడం, నిందితులను...