ఘట్‌కేసర్, జూన్ 30: పోచారం మున్సిపాలిటీ పరిధిలోని నారపల్లి గ్రామంలోని టీచర్స్ కాలనీ, బాబానగర్ కాలనీల్లో నెలకొన్న డ్రైనేజ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
ఆయన ఆదేశాల మేరకు ఘట్‌కేసర్ సర్కిల్ కమిషనర్, ఏఈ విశేష్ నాయక్, రంగనాయక్‌లు స్థానిక నాయకులతో కలిసి కాలనీల్లో పర్యటించి డ్రైనేజ్ సమస్యలను పరిశీలించారు. సమస్యల తీవ్రతను తెలుసుకుని, తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి సూచించారు.
ఈ సందర్భంగా పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎర్ర రాజు, టీఆర్ఎస్ నాయకులు సుర్వి రవీందర్, అభవతిని నరసింహ, నరేందర్ రెడ్డితో పాటు కాలనీవాసులు వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధుకర్, కుమార్, సురేష్, లక్ష్మణ్ నాయక్, ఎం. వెంకట్రెడ్డి, బి. నాగేశ్వర్, లోకేష్, బలరాం, సుగుణమ్మ, ప్రదీప్, సద్గుణ చారి తదితరులు పాల్గొన్నారు.
కాలనీల్లో డ్రైనేజ్ సమస్యల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యల పరిష్కారానికి అధికారులు త్వరితగతిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. అధికారులు సమస్యలను పరిశీలించి త్వరలోనే పరిష్కార చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.




