📄 ePaper
Monday, June 29, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్షార్ట్ సర్క్యూట్‌తో 5 ఎకరాల అరటి తోట దగ్ధం – రూ.16 లక్షల పంట నష్టం...

షార్ట్ సర్క్యూట్‌తో 5 ఎకరాల అరటి తోట దగ్ధం – రూ.16 లక్షల పంట నష్టం కన్నీరుమున్నీరవుతున్న రైతు మునీంద్రా – బాధితులను పరామర్శించిన బిజెపి నాయకులు

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 02) బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండలం నాయనపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ రైతు కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది.తోడేటి మునీంద్రా,రమణయ్య ,డేగ మాధవ్,వెంకటరామయ్య చెందిన అరటి తోటలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి.క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించి సుమారు 5 ఎకరాల తోట పూర్తిగా కాలి బూడిదయ్యింది. చేతికొచ్చే దశలో ఉన్న పంట ఆహుతి కావడంతో సుమారు 16 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.విషయం తెలుసుకున్న బిజెపి జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి, కిసాన్ మోర్చా కడప జిల్లా అధ్యక్షులు అన్నపురెడ్డి అశోక్ కుమార్ రెడ్డి,బిజెపి మండల అధ్యక్షుడు బిజీవేముల నారాయణరెడ్డి, భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బుసిరెడ్డి మనోహర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దగ్ధమైన తోటను పరిశీలించి బాధితుడికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ.. ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంట కళ్ళముందే కాలిపోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.వెంటనే హార్టికల్చర్ అధికారులతో ఫోన్లో మాట్లాడి, తక్షణమే క్షేత్రస్థాయి పరిశీలన జరిపి బాధితులకు ప్రభుత్వం తరపున గరిష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.బాధిత రైతుకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ పర్యటనలో OBC మోర్చా జిల్లా అధ్యక్షులు ముప్పే వెంకట్ నాయుడు,OBC మోర్చా జిల్లా కార్యదర్శి మున్నెల్లి గురవయ్య, SC మోర్చా జిల్లా కార్యదర్శి తిరుపాల్, కిసాన్ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు జయరాం, ఓ బి సి మండల ఉపాధ్యక్షుడు నరసాపురం పోలేరు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular