షార్ట్ సర్క్యూట్‌తో 5 ఎకరాల అరటి తోట దగ్ధం – రూ.16 లక్షల పంట నష్టం కన్నీరుమున్నీరవుతున్న రైతు మునీంద్రా – బాధితులను పరామర్శించిన బిజెపి నాయకులు
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే 02) బద్వేలు నియోజకవర్గం కాశీనాయన మండలం నాయనపల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ రైతు కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది.తోడేటి మునీంద్రా,రమణయ్య ,డేగ మాధవ్,వెంకటరామయ్య చెందిన అరటి తోటలో ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు ఒకదానికొకటి తగిలి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి.క్షణాల వ్యవధిలోనే మంటలు వ్యాపించి సుమారు 5 ఎకరాల తోట పూర్తిగా కాలి బూడిదయ్యింది. చేతికొచ్చే దశలో ఉన్న పంట ఆహుతి కావడంతో సుమారు 16 లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.విషయం తెలుసుకున్న...