📄 ePaper
Monday, June 29, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriఆపదలో ఉన్న జర్నలిస్టుకు రూ.10 వేల ఆర్థిక సాయం, అండగా నిలిచిన కాంగ్రెస్...

ఆపదలో ఉన్న జర్నలిస్టుకు రూ.10 వేల ఆర్థిక సాయం, అండగా నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, జూన్ 29: ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ఎప్పుడూ ముందుండే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఘట్కేసర్ డివిజన్ పరిధిలోని పోచారం సర్కిల్ 8వ వార్డు రాజీవ్ గృహకల్ప కాలనీలో నివసిస్తున్న జర్నలిస్ట్ సంజయ్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకుని ఆయనకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

పోచారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు దేవేందర్ ముదిరాజ్, స్థానిక కాంగ్రెస్ కార్యకర్తల ద్వారా విషయం తెలుసుకున్న శ్రీకాంత్ రెడ్డి వెంటనే స్పందించి, సంజయ్ కుమార్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని సహాయ హస్తం అందించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే బాధ్యతాయుతమైన సేవ చేస్తున్నారని, వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.

భవిష్యత్తులో కూడా అవసరమైన సహాయం అందిస్తానని జర్నలిస్టు కుటుంబానికి శ్రీకాంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఆయన స్పందనకు సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులు, కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే శ్రీకాంత్ రెడ్డి వంటి నాయకులు ఉండటం నియోజకవర్గానికి గర్వకారణమని స్థానికులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దేవేందర్ ముదిరాజ్, యూత్ కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు పద్మావతి, శశికళ, రేవంత్ అన్న టీమ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular