*శాస్త్రీయ భూ పరీక్షలతో పంటల సాగు రైతులకు మేలు*
-షన్ముఖ అగ్రిటేక్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు
-విత్తనం నుండి పంట కోత వరకు సంపూర్ణ సూచనలు
-ప్రభుత్వ పథకాలపై మార్గదర్శకాలు ఆందిస్తాం
*ప్రజావాణి, అందోలు ప్రతినిధి*
శాస్త్రియ వ్యవసాయ భూ పరీక్షలు చేసుకుంటే భూమిలో ఉన్న విలువలు తెలిసి అందుకు తగిన పంటలు వేసుకుంటే రైతుకు అధిక పంట దిగుబడులు వస్తాయని షన్ముఖ అగ్రిటేక్ లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా వట్టిపల్లి మండల కేంద్రంలో శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ వారి, షన్ముఖ అగ్రిటేక్ ఆధ్వర్యంలో పంట అధిక దిగుబడి ఎలా పొందాలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ జనరల్ మేనేజర్, వైస్ ప్రెసిడెంట్ బిక్షమయ్య, మార్కేట్ డెవెలప్మెంట్ హెడ్ శశిధర్ లు రైతులకు పలు సూచనలు చేశారు. పరిమితికి మించి మందులు వాడటం వల్ల భూమిలో సారవంతం తగ్గి, అధిక దిగుబడి రాదన్నారు. మా కంపేని సూచనల ప్రకారం పంటలను సాగు చేయడం వల్ల రైతులకు ఖర్చులు తగ్గుతాయని వారు సూచించారు. మాపై భరోసా వుంచి ఒక ఎకరం భూమిలో మా కంపేని సూచనల ప్రకారం వ్యవసాయం చేసి పంట దిగుబడికి నిత్య స్వామి గమనించాలని వారు సూచించారు. మీ గ్రామానికే వచ్చి పంట పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి ఉచితంగా శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతంగానికి అందించే ఉచిత సంక్షేమ పథకాలపై అందరికీ అవగాహన ఉండదు కాబట్టి మా కంపేని హక్ అనే సంస్థతో కలిసి ఉచిత పథకాలను అర్హులైన రైతులకు అందేలా తోడ్పాటు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివశక్తి గ్రూప్ ఆఫ్ కంపెనీ వారి షణ్ముఖ అగ్రిటేక్ కంపెనీ సిబ్బంది అశోక్, ఇస్మాయిల్, శంకర్ తదితరులతో పాటు వట్టిపల్లి పరిసర ప్రాంతాల రైతులు పాల్గొన్నారు.



