📄 ePaper
Wednesday, July 1, 2026
📄 ePaper
HomeతెలంగాణJayashankar Bhupalpallyభూపాలపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంఆర్ఐ యంత్రం ప్రారంభం

భూపాలపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంఆర్ఐ యంత్రం ప్రారంభం

📰 Generate e-Paper Clip

భూపాలపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఎంఆర్ఐ యంత్రం ప్రారంభం

భూపాలపల్లి, జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎంఆర్ఐ యంత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుండి వర్చువల్ విధానంలో ఘనంగా ప్రారంభించారు.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , భూపాలపల్లి ఎమ్మెల్యే శ్రీ గండ్ర సత్యనారాయణ రావు , జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ శర్మ  పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం  లాంఛనంగా ప్రారంభించగానే జిల్లా ఆసుపత్రిలో హర్షధ్వానాలు మిన్నంటాయి. నీలం రంగు బెలూన్లతో అలంకరించిన ఎంఆర్ఐ కేంద్రం పండుగ వాతావరణాన్ని తలపించింది.

ప్రజా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు  మాట్లాడుతూ “10 ఏళ్లు అధికారంలో ఉన్న పాలకులకు వంద పడకల జిల్లా ఆసుపత్రికి ఒక సిటీ స్కానింగ్, ఒక సిటీ ఎంఆర్ఐ మిషన్ తేవాలన్న ఆలోచన కూడా రాలేదు. ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి వ్యక్తిగత లాభాల కోసమే పాకులాడారు. కానీ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి  చొరవతో, సీఎస్  సహకారంతో జిల్లాకు ఎంఆర్ఐ సదుపాయం వచ్చింది. ఇది ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికున్న చిత్తశుద్ధికి నిదర్శనం” అని ఘాటుగా విమర్శించారు.
జిల్లా ప్రజలకు వరం 
ఇప్పటివరకు ఎంఆర్ఐ స్కానింగ్ కోసం వరంగల్, కరీంనగర్ వంటి నగరాలకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసుకోవాల్సిన దుస్థితి జిల్లా ప్రజలకు తప్పింది. ఇకపై పేద, మధ్యతరగతి రోగులకు స్థానికంగానే ఉచితంగా అత్యాధునిక ఎంఆర్ఐ సేవలు అందుబాటులోకి వచ్చాయి. సీఎం  చేతుల మీదుగా, రాష్ట్ర సీఎస్  సమక్షంలో ప్రారంభం కావడంతో జిల్లా ప్రభుత్వాసుపత్రికి మహర్దశ పట్టింది.

ఈ కార్యక్రమంలో డీఎంఅండ్‌హెచ్‌ఓ, ఆసుపత్రి సూపరింటెండెంట్, వైద్యాధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular