📄 ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్విశ్రాంత ఉద్యోగుల పితామహుడు డిఎస్ నకర గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

విశ్రాంత ఉద్యోగుల పితామహుడు డిఎస్ నకర గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

📰 Generate e-Paper Clip

బద్వేల్ జులై 29 ప్రజావాణి పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ వచ్చే దానికి కారకుడైన డిఎస్ నగర వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగుల సంఘం గౌరవ సలహాదారు గడి పుల్లం రాజు మాట్లాడుతూ 1982 సంవత్సరంలో నకర సుప్రీంకోర్టులో చంద్ర సూడు న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఐదు మంది ధర్మాసనముతో కూడిన తీర్పులో సంచలమైన తీర్పు రావడం జరిగిందని దాని ఫలితమే నేడు విశ్రాంతి ఉద్యోగులు పెన్షన్ పొందుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ పెన్షన్ అనేది బిక్ష కాదని హక్కు అని అన్నారు. విశ్రాంత ఉద్యోగులు ఎవరి పైన ఆధారపడకుండా పెన్షన్తో జీవించడమనేది నగర పుణ్యమే అని కొనియాడారు.పెన్షన్ తీసే హక్కు ఎవరికీ లేదని ఉద్యోగులు పనిచేసిన దానికి ప్రతిఫలంగా ఇచ్చే గౌరవమేని అన్నారు.పెన్షన్ పొందుతున్న ప్రతి వ్యక్తి నగర ని స్మరించుకోవాలని ఆయన పుణ్యమే నేడు పెన్షన్ వచ్చేదానికే కారణం అని అన్నారుఈ కార్యక్రమంలో కార్యదర్శి కత్తి బ్రహ్మయ్య, గౌరవ సలహాదారు గడి పుల్లమ్మ రాజు, ఉపాధ్యక్షులు ముండ్లపాటి పిచ్చయ్య, కాడి ఆనందరావు, సి వి ప్రసాద్ వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యులు సుబ్బరాయుడు,చిన్న రాయుడు తిమ్మయ్య సంజన రామసుబ్బయ్య ఇస్మాయిల్ తదితరులు పాల్గొని ఆయన చిత్ర పటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular