📄 ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper

📰 Generate e-Paper Clip

కోటగిరి – పోతంగల్ నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు బాధ్యతలు స్వీకరణ.

నూతన కార్యవర్గానికి బాధ్యతలు అప్పజెప్పిన తాజా మాజీ అధ్యక్షులు.

ఉమ్మడి మండలాల ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా పులకంటి కృష్ణ కుమార్.

తాజా మాజీ అధ్యక్షునికి ఘనంగా సన్మానించిన క్లబ్ సభ్యులు.

కోటగిరి/ప్రజావాణి:-కోటగిరి,పోతంగల్ మండలాలకు చెందిన నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గం మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా తాజా మాజీ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ (భారతి డిజిటల్ న్యూస్) కు ఉమ్మడి కోటగిరి మండల ప్రెస్ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు.అనంతరం ఆయన చేతుల మీదుగా నూతన కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. అధ్యక్షులుగా పులకంటి కృష్ణకుమార్ (V6 వెలుగు), ఉపాధ్యక్షులుగా పుప్పాల సైదయ్య (తెలంగాణ పత్రిక), ప్రధాన కార్యదర్శిగా బి.సాయిలు (ప్రభ న్యూస్), కోశాధికారిగా గాయక్వాడ్ రాము (జనం సాక్షి),సహాయ కార్యదర్శిగా పి.పెంటయ్య (ఆంధ్ర ప్రభ),ముఖ్య సలహాదారులుగా రాజు (అక్షర టుడే), బేగరి రాములు (పోరు న్యూస్),గౌరవ అధ్యక్షులుగా గోగినేని హన్మంత్ రావు (జ్ఞాన తెలంగాణ),సాయిబాబా గౌడ్ (భారతి డిజిటల్ న్యూస్) పదవి బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు గోగినేని హనుమంతరావు (జ్ఞాన తెలం గాణ) మాట్లాడుతూ.ప్రజాస్వామ్యంలో మీడియా నాలుగవ స్తంభంగా వెలుగొందుతోందని.జర్నలిజం వృత్తి చాలా పవిత్ర మైనదని,బాధ్యతతో కూడుకున్నదని పేర్కొన్నారు.ప్రజా సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడంలోను,ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలోను మీడియా పాత్ర కీలకమని తెలిపారు.ఇటు ప్రజలకు అటు ప్రభుత్వాలకు వారధిగా ఉంటూ,నిజాలను నిర్భయంగా రాస్తూ ప్రజా సంక్షేమానికి పాటుపడడం ప్రతి జర్నలిస్టుకు గర్వకారణమ ని అన్నారు.గురు పౌర్ణమి రోజున ఉమ్మడి మండలాల నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన వారికి ప్రెస్ క్లబ్ సభ్యుల తరఫున ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు కాసుల శ్రీకాంత్ (నవ తెలంగాణ),గంగాధర్, ఎడ్డెడి.అనిల్ (ప్రజా వాణి),పబ్బ నవీన్ (నమస్తే ఇందూరు వార్త),వి.నరేష్ (సమయం),గంట్ల రాజు (మన తెలంగాణ), హైమద్ (ఆజ్ కా తెలంగాణ),తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular