📄 ePaper
Wednesday, July 29, 2026
📄 ePaper
Homeఅంతర్జాతీయంపెన్షనర్స్ పితామహుడు " డి. యస్.నకారా " వర్ధంతి

పెన్షనర్స్ పితామహుడు ” డి. యస్.నకారా ” వర్ధంతి

📰 Generate e-Paper Clip

పొదిలి (జులై 29 ప్రజావాణి) పెన్షనర్ల భవనములో పెన్షన్ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ద పెన్షనర్స్ అయినా డి యస్. నకారా గారి వర్ధంతి సభ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి షేక్ మదార్ వలి ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన నకారా గారు సుప్రీంకోర్టులో కేసు వేసి పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని, ప్రభుత్వ దయాదాక్షిన్యాలపై ఆధారపడేది కాదని, ఉద్యోగులు గతంలో చేసిన సేవలకు ప్రతిఫలమని సుప్రీంకోర్టులో వాదించి పెన్షన్ హక్కును సాధించారని,ప్రస్తుతం ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ పొందుతూ ఆనందంగా జీవించడానికి కారణం ఈ నకారా గారు అని ప్రధాన కార్యదర్శి షేక్ మదార్ వలి గారు తెలిపారు.పెన్షన్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ బాదుల్లా గారు, అసోసియేటెడ్ అధ్యక్షులు డిఎల్ నరసింహారావు గారు నకారా గారి జీవిత చరిత్రను, కేంద్ర సర్వీసులలో వారు నిర్వహించిన పదవులను, హోదాలను పెన్షన్ హక్కు కొరకు ఆయన చేసిన పోరాట పటిమలను వివరంగా తెలిపారు తదుపరి నకారా  వర్ధంతి సందర్భంగా భవిత పాఠశాలలోని, మూగ,చెవిటి,మానసిక వికలాంగ విద్యార్థులకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలోషేక్ మదార్ వలి, బాదుల్లా,వీరారెడ్డి, డిఎల్ నరసింహారావు, డివి సుబ్బారావు, గోవిందయ్య, భాషా మొహిద్దిన్, కీసరి శ్రీనివాసరెడ్డి, జానీ బేగ్, ఎల్లమందరెడ్డి, విజయలక్ష్మి, చంద్రావతి, శ్రీధర్, మీరావలి, ఫకీర్ అహమ్మద్, ఎలైజర్, ఆశీర్వాదం, కాటూరి వెంకటేశ్వర్లు, ఆశ వెంకటేశ్వర్లు తదితర పెన్షనర్లు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular