📄 ePaper
Monday, August 3, 2026
📄 ePaper
HomeతెలంగాణHanumakondaవిజ్ఞాన్ విద్యాలయంలో ఘనంగా బోనాల వేడుకలు

విజ్ఞాన్ విద్యాలయంలో ఘనంగా బోనాల వేడుకలు

📰 Generate e-Paper Clip



ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-

ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలోని విజ్ఞాన్ విద్యాలయంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించగా,పోతురాజు వేషధారణలు,జానపద నృత్యాలు,అమ్మవారి వేషధారణలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి చూపరులను అలరించాయి.ఈ వేడుకలకు తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులను అభినందించారు. తెలంగాణ సంస్కృతిని చిన్నారులకు పరిచయం చేయడంతో పాటు సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ నడిపెల్లి ప్రభాకర్ రావు, రాధ నడిపెల్లి,సుధీర్ కుమార్, గీతాశ్రీతో పాటు ఉపాధ్యాయులు షెహనాజ్, రాణి,శ్వేత,అసిఫా పాల్గొన్నారు.అమ్మవారి ఆశీస్సులతో పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామ ప్రజలు ఆరోగ్యంగా సుఖశాంతులతో జీవించాలని, విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular