విజ్ఞాన్ విద్యాలయంలో ఘనంగా బోనాల వేడుకలు
ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామంలోని విజ్ఞాన్ విద్యాలయంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా బోనాల వేడుకలను ఘనంగా నిర్వహించారు.విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించగా,పోతురాజు వేషధారణలు,జానపద నృత్యాలు,అమ్మవారి వేషధారణలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి చూపరులను అలరించాయి.ఈ వేడుకలకు తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విద్యార్థులను అభినందించారు. తెలంగాణ సంస్కృతిని చిన్నారులకు పరిచయం చేయడంతో పాటు సంప్రదాయాల పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల...