ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు: మొక్కలకు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు కట్టిన రాక్‌స్టార్ యూత్..
కోదాడ టౌన్, ఆగస్టు 02/ప్రజావాణి
పట్టణంలోని 22వ వార్డులో స్నేహితుల దినోత్సవ (ఫ్రెండ్‌షిప్ డే) వేడుకలను రాక్‌స్టార్ యూత్ టీమ్ సభ్యులు ఆదివారం వినూత్నంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులందరూ కలిసి వార్డు ప్రాంగణంలో పలు రకాల మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తాము నాటిన మొక్కలను స్నేహితులుగా భావిస్తూ వాటికి ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు కట్టడం విశేషం.ఈ సందర్భంగా రాక్‌స్టార్ యూత్ టీమ్ సభ్యులు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడుకోవాలని, కేవలం మనుషులకే కాకుండా ప్రకృతికి కూడా మనం స్నేహితులుగా మారాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షిస్తామని వారు ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో 22వ వార్డు రాక్‌స్టార్ యూత్ టీమ్ సభ్యులు, స్థానిక యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
ఘనంగా స్నేహితుల దినోత్సవ వేడుకలు: మొక్కలకు ఫ్రెండ్‌షిప్ బ్యాండ్లు కట్టిన రాక్‌స్టార్ యూత్
RELATED ARTICLES




