📄 ePaper
Thursday, April 16, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetఅరైవ్ అలైవ్ రోడ్ భద్రత ప్రోగ్రాం లో భాగంగా, జడ్.పి.హెచ్.ఎస్ రంగదాంపల్లి స్కూల్ విద్యార్థులకు రోడ్...

అరైవ్ అలైవ్ రోడ్ భద్రత ప్రోగ్రాం లో భాగంగా, జడ్.పి.హెచ్.ఎస్ రంగదాంపల్లి స్కూల్ విద్యార్థులకు రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం..

📰 Generate e-Paper Clip

 

సిద్దిపేట్, ఏప్రిల్ 15, ప్రజావాణి

సిద్దిపేట్ అరైవ్ అలైవ్ రోడ్ భద్రత ప్రోగ్రాం లో భాగంగా, జడ్.పి.హెచ్.ఎస్ రంగదాంపల్లి స్కూల్ విద్యార్థులకు రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, విద్యార్థులకు ట్రాఫిక్ రూల్స్ గురించి వివరించి, రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేయడం జరిగింది, అలాగే ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటించాలని,బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలని మద్యం సేవించి వాహనం నడపకూడదని, సీట్ బెల్ట్ పెట్టుకుని కారు నడపవలెనని విద్యార్థుల చేత వాళ్ల యొక్క తల్లిదండ్రులకు లేఖ ద్వారా వినతిపత్రం రాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై విజయభాస్కర్, పాఠశాల హెడ్మాస్టర్ మంజుల, ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular