📄 ePaper
Friday, May 15, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్రక్షణ యుద్ధ విమానాల తయారీ కేంద్రం రాకపై పరిటాల సునీత హర్షం జిల్లాకే ఇది...

రక్షణ యుద్ధ విమానాల తయారీ కేంద్రం రాకపై పరిటాల సునీత హర్షం జిల్లాకే ఇది తలమానికంగా ఉంటుందన్న ఎమ్మెల్యే సునీత

📰 Generate e-Paper Clip

సత్యసాయి జిల్లా మే14 ప్రజావాణి న్యూస్ .ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపు కుటుంబంలో శుభకార్యం వలన హాజరు కాలేకపోతున్నట్టు తెలిపిన సునీత దేశ రక్షణ రంగంలో అత్యంత కీలకంగా భావిస్తున్న. 5వ తరం యుద్ధ విమానం (‘అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్’) తయారీ పరిశ్రమ శ్రీసత్యసాయి జిల్లాకు రావడం చాలా సంతోషంగా ఉందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ఇది జిల్లాకే తలమానికంగా మారనుందని ఆమె చెప్పారు. ఈ పరిశ్రమకు భూమి పూజ చేసేందుకు శుక్రవారం జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు ఆమె ముందస్తుగా స్వాగతం పలికారు. పుట్టపర్తిలో రూ.15వేల కోట్ల పెట్టుబడితో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు కేంద్ర రక్షణ రంగ సంస్థ డీఆర్డీవో ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 600 ఎకరాల భూమి కేటాయించిందన్నారు. ఈప్రాజెక్టుకు అనుబంధంగా యూనిట్ల ఏర్పాటు ద్వారా పెట్టుబడులు రానున్నాయన్నారు.ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు కృషితోనే సాధ్యమవుతోందన్నారు. శుక్రవారం జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని ఆమె పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తన కుటుంబంలో (హైదరాబాద్) ఒక ముఖ్యమైన శుభకార్యం ఉండటం వలన ఈ కార్యక్రమానికి తాను హాజరుకాలేకపోతున్నట్టు ఎమ్మెల్యే సునీత తెలిపారు. అలాగే మంత్రి నారా లోకేష్ కార్యక్రమంలో కూడా పాల్గొనాల్సి ఉన్నా.. ఈ కార్యక్రమం వలన హాజరు కాలేక పోతున్నానని చెప్పారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular