📄 ePaper
Thursday, July 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్జగ్గయ్యపేట హైవే మీద ఉన్న ఫుడ్ ప్లాజాలొ సంఘటన..వేల రూపాయలు తీసుకుంటూ కక్కుర్తితో వ్యవహరిస్తున్న ఫుడ్...

జగ్గయ్యపేట హైవే మీద ఉన్న ఫుడ్ ప్లాజాలొ సంఘటన..వేల రూపాయలు తీసుకుంటూ కక్కుర్తితో వ్యవహరిస్తున్న ఫుడ్ ప్లాజా యాజమాన్యం..

📰 Generate e-Paper Clip

ఎన్టీఆర్ జిల్లా   మే14 ప్రజావాణి న్యూస్ జగ్గయ్యపేట క్వాలిటీ ఫుడ్ అని ప్రజలను నమ్మించి ఈ రకంగా మోసం చేస్తున్న ఫుడ్ ప్లాజా యాజమాన్యం.చికెన్ బిర్యాని అడుగగా విపరీతమైన దుర్గంధం వచ్చే బిరియానిని సప్లై చేసిన సప్లైర్లు.ఈ హోటల్ వారు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ధనాపేక్షతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పుడ్ ప్లాజా.ఈ హోటల్ పై ఫుడ్ కమిషనర్లు వచ్చినా కూడా నామ మాత్రం తనిఖీలు చేసి కాసులకు కక్కుర్తి పడి కనీసం అటువైపు తిరిగి చూడని అధికారులు.ఫుడ్ ప్లాజా వ్యవహారంపై అనేకమార్లు న్యూస్ వేసిన అక్కడ బార్కెట్లు విషయంలో అనేకమంది పోరాడిన..రాజకీయ అండదండలతో ముందుకు వెళుతున్న వెంకట సాయి ఫుడ్ ప్లాజా.హైవే పై డివైడర్ ఉండటం వలన ఇప్పటిదాకా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు అయినా అధికారులు పట్టించుకోని వైనం.అక్కడ యాక్సిడెంట్ అయ్యి మనిషి చనిపోయినప్పుడే అడావుడి చేసే నాయకులు అధికారులు.ఈరోజు చద్ది బిర్యాని పెట్టి కస్టమర్ల డబ్బులు దోచుకుంటున్న కొద్దిగా కూడా ఆలోచన లేకుండా సూపర్వైజర్ అది సరిగా ఉడకలేదని సాకులు చెబుతున్న వైనం.కానీ అది ఫ్రిజ్లో పెట్టింది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఈ వ్యవహారంపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.వీరి ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతుంది..ఈ వ్యవహారంపై అధికారులు ఇకనైనా మొద్దు నిద్ర వీడి కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న కస్టమర్లు.ఈ వ్యవహారంపై స్ధానికులు మండిపడుతున్న వైనం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular