వైఎస్ఆర్ కడప జిల్లా (ప్రజావాణి*న్యూస్*జులై* *01)*కాసినయన మండలం సావిశెట్టిపల్లె (అక్కంగుండ్ల) భూ వివాదంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO) కోన నర్సిములు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశ సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేసిన రిటైర్డ్ ఆర్మీ (మాజీ సైనికుల) సిబ్బందికి ప్రభుత్వ భూములు కేటాయించాలంటే జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైన నిరాక్షేపణ పత్రం (NOC) తప్పనిసరి అనే నిబంధన ఉంది. అయితే, ఎలాంటి ఎన్ఓసి లేకుండా,కనీస విచారణ కూడా జరపకుండా సర్వే నంబర్ 144-2లో ఉన్న వివాదాస్పద భూమిని ‘డిస్ట్రబ్డ్’ (వివాదాస్పద) జాబితా నుండి విఆర్ఓ తొలగించడం ఇప్పుడు రెవెన్యూ వర్గాల్లో పెద్ద సంచలనంగా మారింది.ఈ తీవ్రమైన అధికార దుర్వినియోగం, నిబంధనల ఉల్లంఘనపై రూపొందించిన ఈ కోన, కాసినయన మండలం సావిశెట్టిపల్లె రెవెన్యూలో బరితెగింపు: కోర్టులో భూమి ఉండగానే క్లియరెన్స్ ఇచ్చిన వీఆర్వో! ప్రభుత్వ భూములపై ‘కోన నర్సిములు’ లీలలు.
కలెక్టర్ NOC లేకుండానే వివాదాస్పద జాబితా నుంచి తొలగింపు ఎవరికోసం ఈ గుట్టుచప్పుడు కాని వ్యవహారం? దీని వెనుక ఉన్న అంతగతం ఏమిటి?చట్టాలు చుట్టాలవుతున్నాయి.నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.బద్వేల్ rdo కోర్టు పరిధిలో ఉన్న భూములను సైతం తమ సొంత జాగీరులా మార్చేస్తున్నా వీఆర్వో కోన .సావిశెట్టి పల్లె అక్యుగుoడ్ల భూముల విషయంలో వైఎస్ఆర్ కడప జిల్లా కాసినయన మండలం, సేవిశెట్టిపల్లె (అక్కంగుండ్ల) రెవెన్యూ పరిధిలో ఒక దారుణమైన అక్రమ వ్యవహారం వెలుగుచూసింది.సర్వే నంబర్ 144-2లో ఉన్న సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమి చుట్టూ ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతోంది. బద్వేల్ ఆర్డీఓ (RDO) కోర్టులో ఈ భూమిపై వివాదం నడుస్తుండగానే, స్థానిక వీఆర్వో (VRO) కోన నర్సిములు ఎటువంటి ఉన్నతాధికారుల అనుమతులు లేకుండానే డిస్ట్రబ్డ్ (వివాదాస్పద) జాబితా నుంచి ఆ భూమిని తొలగించడం వెనుక ఉన్న ‘అంతగతం’ఏమిటనే ప్రశ్నలు జిల్లావ్యాప్తంగా హడలెత్తిస్తున్నాయి.*కలెక్టర్ NOC ఎక్కడ*చట్టం ఏం చెబుతోంది?నిబంధనల ప్రకారం,రిటైర్డ్ ఆర్మీ అధికారులకు లేదా మాజీ సైనికులకు ప్రభుత్వ భూమిని కేటాయించాలన్నా, బదిలీ చేయాలన్నా దానికి అత్యున్నత అధికార సంస్థ అయిన జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి అధికారికంగా నిరాక్షేపణ పత్రం (NOC) రావలసి ఉంటుంది.కలెక్టర్ అనుమతి లేనిదే ఆ భూమిపై ఎటువంటి మార్పులు లేదా కేటాయింపులు చేయడానికి కింది స్థాయి సిబ్బందికి అస్సలు హక్కు లేదు.కానీ,ఇక్కడ విఆర్ఓ కోన నర్సిములు చట్టాన్ని తన జేబులో పెట్టుకున్నట్లు వ్యవహరించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు లేదా ఎన్ఓసి రాకముందే, సర్వే నంబర్ 144-2లోని భూమికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం వెనుక ఉన్న మతలబు ఏమిటి? ఆర్డీఓ కోర్టును సైతం బేఖాతరు చేస్తారా?మరోవైపు ఈ నిర్దిష్ట భూమికి సంబంధించిన వివాదం బద్వేల్ ఆర్డీఓ (RDO) కోర్టులో నడుస్తోంది. ఒక భూమి న్యాయస్థాన పరిధిలో ఉన్నప్పుడు, దానిపై తుది తీర్పు వచ్చే వరకు లేదా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి విచారణ (Enquiry) జరిపి నివేదిక ఇచ్చే వరకు ఆ రికార్డులను ముట్టుకునే సాహసం ఎవరూ చేయరు.కానీ ఇక్కడ విఆర్ఓ కనీస విచారణ కూడా జరపలేదు.అసలు వివాదం ఏంటి? కోర్టులో కేసు ఎందుకు నడుస్తోంది? అనే ప్రాథమిక విషయాలను పూర్తిగా తొక్కిపెట్టి, రహస్యంగా ఆ భూమిని వివాదాస్పద జాబితా నుండి తొలగించడం వెనుక పెద్ద ఎత్తున చేతులు మారాయనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి.దీని వెనుక ఉన్న అంతగతం ఏమిటి?ఒక సాధారణ వీఆర్వో స్థాయి అధికారి జిల్లా కలెక్టర్‌ను, ఆర్డీఓ కోర్టును దాటి ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే దీని వెనుక రాజకీయ అండదండలు లేదా బడా భూబకాసురుల హస్తం ఖచ్చితంగా ఉండి తీరుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.లక్షల రూపాయల చేతులు మారాయా?ఎటువంటి ఎంక్వైరీ లేకుండా రాత్రికి రాత్రే రికార్డులను మార్చడం వెనుక భారీ స్థాయిలో అవినీతి జరిగిందా ఒత్తిళ్లు ఎవరివి?: ప్రభుత్వ భూమిని ఏ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి ఈ క్లియరెన్స్ ఇచ్చారు ఉన్నతాధికారుల కళ్లుగప్పారా ఆర్డీఓ కోర్టులో స్టేటస్ తెలిసి కూడా విఆర్ఓ ఇంత సాహసానికి ఒడిగట్టడం వెనుక రెవెన్యూ విభాగంలో ఎవరెవరి పాత్ర ఉందో తేలాల్సి ఉంది. ఒక వ్యక్తిని ఫోన్లో సంభాషించి అడగగా మాకు తెలియదు అధికారులే దీని తొలగించారు అని చెప్పడం జరిగింది *మిగతా అధికారుల గురించి రేపటి సంచికలో మీ ప్రజావాణి ప్రజల ముందు*
బద్వేల్ RDO కోర్టును బేఖాతరు చేసిన వీఆర్వో: 144-2 సర్వే నంబర్ భూమి తొలగింపు వెనుక భారీ స్కామ్
RELATED ARTICLES




