మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు
నడికూడ, జూలై 1 (ప్రజావాణి):
నడికూడ గ్రామ మాజీ సర్పంచ్, తెలంగాణ ఉద్యమకారుడు ఊర రవీందర్ రావు సతీమణి ఊర నిర్మల దశదినకర్మ కార్యక్రమం బుధవారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు హాజరై నిర్మల చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం శోకసంద్రంలో ఉన్న ఊర రవీందర్ రావు మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పరకాల బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు చింతి రెడ్డి మధుసూదన్ రెడ్డి, మాదారం సొసైటీ చైర్మన్ నల్లేలా లింగమూర్తి, బీఆర్ఎస్ నడికూడ మండల ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతి రెడ్డి, నడికూడ మండల మాజీ వైస్ ఎంపీపీ చందా కుమార్, బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి లింగాల తిరుపతి, మండల సమన్వయ కమిటీ సభ్యులు భీమిడి నాగిరెడ్డి, నందికొండ జైపాల్ రెడ్డి, కౌకొండ-సర్వాపురం-ధర్మారం మాజీ ఎంపీటీసీ మేకల సతీష్, తెలంగాణ ఉద్యమకారుడు సంఘాని వేణు, బీఆర్ఎస్ నాయకులు మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా పలువురు స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై రవీందర్ రావు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మాజీ సర్పంచ్ ఊర రవీందర్ రావు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు
RELATED ARTICLES


