📄 ePaper
Thursday, July 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ శ్రీ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి,తనిఖీలు 

కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ చైర్మన్ శ్రీ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి,తనిఖీలు 

📰 Generate e-Paper Clip

గూడూరు జూలై 02 ప్రజావాణి మండలంలోని గుడిపాడు అంగన్వాడి కేంద్రం మరియు గూడూరులోని జూనియర్ కళాశాలను తనిఖీ చేయడం జరిగినది.గుడిపాడు అంగన్వాడి కేంద్రంలో కోడిగుడ్లను పరిశీలించగా,వాటి బరువు నిర్దేశిత ప్రమాణాల కంటే తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.దీనిపై అంగన్వాడి నిర్వహకులపై ఆగ్రహం వ్యక్తం చేసి, వెంటనే నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా కోడిగుడ్లను సరఫరా చేయాలని ఆదేశించారు. తదనంతరం గూడూరు అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేయగా,అంగన్వాడి కార్యకర్త హాజరు నమోదును సక్రమంగా నిర్వహించకపోవడం గమనించారు.ఈ నిర్లక్ష్యంపై సంబంధిత సూపర్వైజర్ ద్వారా అంగన్వాడి కార్యకర్తకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఆదేశించారు.అనంతరం రేషన్ షాపును సందర్శించి కార్డుదారులతో మాట్లాడి పంపిణీ వ్యవస్థపై ఆరా తీశారు గూడూరులోని ఐసిడిఎస్ సెంటర్–3 ను తనిఖీ చేయగా,రికార్డుల ప్రకారం 343 కోడిగుడ్లు నిల్వలో ఉండవలసి ఉండగా,కేవలం 43 కోడిగుడ్లు మాత్రమే ఉన్నట్లు గుర్తించబడింది.ఈ వ్యత్యాసంపై సంబంధిత అంగన్వాడి కార్యకర్త మరియు సూపర్వైజర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు.తదనంతరం గూడూరులోని రేషన్ షాపు నెం.1ను తనిఖీ చేయగా,స్టాక్ రికార్డులతో పోల్చితే 170 కిలోల బియ్యం అధికంగా ఉన్నట్లు గుర్తించబడింది. దీనిపై సంబంధిత డీలర్‌పై 6-A కేసు నమోదు చేయడం జరిగింది.అనంతరం ఐసిడిఎస్ సెంటర్ ను తనిఖీ చేయగా,చిన్నారులకు అందిస్తున్న ఆహారం నాణ్యత సంతృప్తికరంగా లేదని,అలాగే రికార్డుల ప్రకారం ఉండవలసిన పరిమాణం కంటే కోడిగుడ్లు అధికంగా ఉన్నట్లు గుర్తించబడింది.గూడూర్ లోని,కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం మరియు గూడూర్ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను (బాలురు & బాలికలు) లను తనిఖీ చేయడం జరిగినది ఎమ్మిగనూరు పాయింట్‌ను తనిఖీ చేసి,నిల్వ, పంపిణీ విధానాలను పరిశీలించడం జరిగినది మరియు సంబంధిత అధికారులకు అవసరమైన సూచనలు ఇవ్వడం జరిగినది.ఆరెకల్‌లోని డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకుల పాఠశాలను తనిఖీ చేసి,విద్యార్థులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత,నిల్వ విధానాన్ని పరిశీలించడం జరిగినది.తనిఖీలో సరుకుల నిల్వలో వ్యత్యాసాలు గుర్తించడం జరిగినది.కౌతాలం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం ను తనిఖీ చేయడం జరిగినది.పాఠశాలలో విద్యార్థినులకు అందిస్తున్న ఆహార మెనూను మార్చడం జరిగినది అని గుర్తించడమైనది.ఈ తనిఖీలలో గౌరవ ఛైర్మన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషన్ శ్రీ చిత్తా విజయ ప్రతాప్ రెడ్డి, శ్రీ.యం.రాజ రఘువీర్,జిల్లా పౌర సరఫరాల అధికారి,శ్రీ. వెంకట రాముడు,డీఎం,సివిల్ సప్లయిస్,ఫుడ్ సేఫ్టీ అధికారి శ్రీ.రాజ గోపాల్,లీగల్ మెట్రాలజీఅధికార,అసిస్టెంట్ డైరెక్టర్ అధికారి తదితరులు పాల్గొనడం జరిగినది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular