📄 ePaper
Thursday, July 2, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్రోడ్డుపై ముగ్గుతో కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు,వాహనదారులు

రోడ్డుపై ముగ్గుతో కలకలం.. భయాందోళనలో గ్రామస్తులు,వాహనదారులు

📰 Generate e-Paper Clip

బెజ్జంకి -కోహెడ, జూలై 2 (ప్రజావాణి)

 

సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని గుండారెడ్డిపల్లి వెళ్లే ప్రధాన రహదారిపై గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి సమయంలో రోడ్డుపై ముగ్గు వేయడంతో గ్రామస్తులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు.ఉదయం రహదారిపై ముగ్గును గమనించిన స్థానికులు, ప్రయాణికులు ఏమి జరిగిందో తెలియక ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు మూఢనమ్మకాలను ప్రోత్సహించేలా ఉండటమే కాకుండా, ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్నాయని గ్రామస్తులు పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular