వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామ సర్పంచ్ ఐత తిరుపతి తండ్రి అనారోగ్యంతో మరణించగా, మండల కాంగ్రెస్ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల ఫోరం అధ్యక్షులు కూస లక్ష్మణ్, మన్నె జితేందర్, ముత్తునూరు సర్పంచ్ పోశం, బిడారి భూమయ్య, రాజేశం, లక్ష్మణ్, శేఖర్, రవి, దుర్గయ్య, సందీప్, లింగయ్య, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
రాంనూర్ సర్పంచ్ తండ్రి మృతి, పరామర్శించిన కాంగ్రెస్ నేత శైలేందర్ రెడ్డి
0
10
- Advertisment -


