📄 ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్బ్రహ్మంగారిమఠం వ్యాపార సముదాయాల ముందు పరిశుభ్రం చేయాలి.రామాలయం దగ్గర నుండి ఐదు రోడ్ల సెంటర్ వరకు...

బ్రహ్మంగారిమఠం వ్యాపార సముదాయాల ముందు పరిశుభ్రం చేయాలి.రామాలయం దగ్గర నుండి ఐదు రోడ్ల సెంటర్ వరకు సమాంతరంగా సిసి రోడ్డును ఏర్పాటు చేయాలి

📰 Generate e-Paper Clip

బ్రహ్మంగారిమఠం జూన్ 08 ప్రజావాణి దేవస్థానం ముందున్న భద్రతా చర్యలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు,5రోడ్ల సెంటర్ నందు ఔట్ పోస్ట్ పోలీస్స్టే షన్,కానిస్టేబుల్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.శివకుమార్ డిమాండ్ వ్యాపార సముదాయముల ముందు అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతంలో పర్యటించిన సిపిఎం బృందం పుణ్య క్షేత్రమైన బ్రహ్మంగారిమఠంలోని వ్యాపారసముదాయాల ముందు శుభ్రం చేసి సిసిరోడ్డుఏర్పాటు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.శివకుమార్ డిమాండ్ చేశారు.బ్రహ్మంగారిమఠంలోని దేవస్థానం ముందున్న ప్రధాన వీధిలో సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో పర్యటించారు,అనంతరం సిపిఎం మండల కార్యదర్శి గండి సునీల్ కుమార్ తో కలసివిలేకరులతో మాట్లాడుతూ మఠం అభివృద్ధి లో భాగంగా దేవస్థానం పరిధిలో అనేక సంవత్సరాలుగా ఉన్న అంగళ్లను తొలగించి వారందరికీ నూతనంగా వ్యాపార సముదాయం కోసం స్థలాన్ని ఇవ్వడం జరిగిందని వారoదరు తమ స్వంత డబ్బులతో అంగళ్లను నిర్మించుకున్నారని ఆరాధన మహోత్సవాలు అయిన వెంటనే వారందరూ అందులో చేరారని అయితే పాత అంగళ్లను తొలగించిన ప్రాంతంలో పెద్ద ఎత్తున మట్టి, రాళ్ళతో అపరిశుభ్రంగా ఉందని దీనివల్ల భక్తులు యాత్రికులు అంగళ్ల దగ్గరికి వెళ్లాలంటే ఇబ్బందికరంగా తయారయిందని వారు తెలిపారు. దీనివల్ల వ్యాపారస్తులకు వ్యాపారాలు కూడా సరిగ్గా జరగటం లేదని కావున దేవస్థానం మఠాధిపతి,జోక్యం చేసుకొని అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతాన్ని అంతా పరిశుభ్రం చేయించి రామాలయం దగ్గరనుండి 5,రోడ్ల సెంటర్ వరకు సమాంతరంగా సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని అదేవిధంగా వ్యాపార సముదాయాన్ని అనుకుని పార్కు కంపౌండ్ వాల్ వరకు స్టీలు గేట్లు ఏర్పాటు చేయాలి తద్వారా వాహనాలు లోపలికి రాకుండా ఉంటాయని దేవస్థానం ప్రధాన వీధిలో ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి రోడ్డుమీద లేకుండా ఏర్పాటు చేయాలని.వ్యాపార సముదాయం ప్రారంభంలో ఖాళీగా ఉంచిన స్థానంలో ఉచిత మినరల్ ప్లాంట్ ఔట్ పోస్ట్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుచేసి 24,గంలు అందుబాటులో పోలీస్ కానిస్టేబుల్ ను నియమించాలని వారు డిమాండ్ చేశారు.భక్తుల,యత్రికుల భద్రతా చర్యల్లో భాగంగా మఠం పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటు చేయాలని,ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలను అందుబాటులోకి తేవాలని వారుకోరారు ఐదు రోడ్ల సెంటర్లో వాహనాలు అడ్డదిడ్డంగా ఉంచడం వల్ల భక్తులు యాత్రికులకే కాక వ్యాపారస్తులకు కూడా ఇబ్బందిగా ఉంటుందని అక్కడ ఒక మఠం సిబ్బందిని ఏర్పాటు చేసి వాటిని నియంత్రించాలని వారు డిమాండ్ చేశారు,ఈ పర్యటన కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు సాన గోవిందస్వామి,హరి నాయకులు రాహుల్,శ్రీనువాసులు భాస్కర్,అరవింద్ ఆంజనేయులు,శ్రీను,రమణ,వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular