📄 ePaper
Wednesday, July 1, 2026
📄 ePaper
HomeతెలంగాణSiddipetగుగ్గిళ్ల గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దూశెట్టి ప్రశాంత్ రెడ్డి

గుగ్గిళ్ల గ్రామశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దూశెట్టి ప్రశాంత్ రెడ్డి

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, జూలై 1 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడిగా దుశెట్టి ప్రశాంత్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షుడిగా సుధామల్ల ప్రశాంత్, ప్రధాన కార్యదర్శిగా తులిశాల రాజశేఖర్ నియమితులయ్యారు.
మానకొండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆదేశాల మేరకు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ ఆధ్వర్యంలో గ్రామ శాఖ కమిటీని ప్రకటించారు.
ఈ సందర్భంగా పులి కృష్ణ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గ్రామ ప్రజలకు చేరవేస్తూ, పార్టీ బలోపేతానికి నూతన కమిటీ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. నాయకులు, కార్యకర్తల సమన్వయంతో గ్రామంలో పార్టీని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.
నూతన గ్రామ శాఖ అధ్యక్షుడు దుశెట్టి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, పార్టీ తనపై ఉంచిన విశ్వాసానికి తగిన విధంగా పనిచేస్తూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు మైల బాలయ్య, తిప్పరవేణి బాబు, కేడిక లచ్చిరెడ్డి, కేడిక కిష్టారెడ్డి, తిరుపతి రెడ్డి, చిట్టి కనుకయ్య, చిట్టి గంగయ్య, యూత్ కాంగ్రెస్ బెజ్జంకి మండల వైస్ ప్రెసిడెంట్ బోయిని ప్రశాంత్, రాజు రెడ్డి, పోతు శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular