బద్వేల్ RDO కోర్టును బేఖాతరు చేసిన వీఆర్వో: 144-2 సర్వే నంబర్ భూమి తొలగింపు వెనుక భారీ స్కామ్
వైఎస్ఆర్ కడప జిల్లా (ప్రజావాణి*న్యూస్*జులై* *01)*కాసినయన మండలం సావిశెట్టిపల్లె (అక్కంగుండ్ల) భూ వివాదంలో విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO) కోన నర్సిములు తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేశ సరిహద్దుల్లో ప్రాణాలు పణంగా పెట్టి సేవ చేసిన రిటైర్డ్ ఆర్మీ (మాజీ సైనికుల) సిబ్బందికి ప్రభుత్వ భూములు కేటాయించాలంటే జిల్లా కలెక్టర్ నుంచి స్పష్టమైన నిరాక్షేపణ పత్రం (NOC) తప్పనిసరి అనే నిబంధన ఉంది. అయితే, ఎలాంటి ఎన్ఓసి లేకుండా,కనీస విచారణ కూడా జరపకుండా సర్వే నంబర్ 144-2లో ఉన్న వివాదాస్పద భూమిని 'డిస్ట్రబ్డ్'...