📄 ePaper
Tuesday, June 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన నగర నిర్మాణం సాధ్యం – కమీషనర్ * రోడ్లపై చెత్త వేస్తే...

ప్రజల భాగస్వామ్యంతోనే పరిశుభ్రమైన నగర నిర్మాణం సాధ్యం – కమీషనర్ * రోడ్లపై చెత్త వేస్తే భారీ జరిమానాలు

📰 Generate e-Paper Clip

(మే25 ప్రజావాణి) మంగళగిరి–తాడేపల్లి నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్‌ రెండవ రోజు విజయవంతం స్వచ్ఛ మంగళగిరి లక్ష్యంగా ముందడుగుడాన్ బాస్కో స్కూల్ నుండి ఉండవల్లి సెంటర్ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమం రెండవ రోజు కూడా  ఉత్సాహభరితంగా కొనసాగింది.కమిషనర్ శ్రీ ఎస్. అలీం బాషా ఆధ్వర్యంలో డాన్ బాస్కో స్కూల్ నుండి ఉండవల్లి సెంటర్ వరకు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో భాగంగా రహదారుల వెంట ఉన్న రెడ్ స్పాట్లు, యెల్లో స్పాట్ల వద్ద పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు.అదేవిధంగా కాలువల శుభ్రపరచడం,డ్రైన్ల డీ-సిల్టింగ్ చెత్త తొలగింపు,రోడ్ల స్వీపింగ్,మురుగు నీటి ప్రవాహాలకు ఆటంకం కలిగిస్తున్న వ్యర్థాలను తొలగించడం వంటి పనులు విస్తృత స్థాయిలో నిర్వహించబడ్డాయి.నగర పరిశుభ్రతను మెరుగుపరచడం,ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు.ఈ సందర్భంగా గౌరవ స్వచ్చాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి ఆరుద్ర భూలక్ష్మి  మాట్లాడుతూ,రాష్ట్ర ప్రభుత్వం పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.“పరిశుభ్రమైన నగరం ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది. ప్రజలు, అధికారులు,పారిశుద్ధ్య సిబ్బంది అందరూ సమిష్టిగా పనిచేసినప్పుడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ లక్ష్యం సాకారం అవుతుంది” అని పేర్కొన్నారు. అలాగే ప్రతి కుటుంబం తడి–పొడి చెత్తను వేరు చేసి అందించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని తెలిపారు.ఆపరేషన్ క్లీన్ స్వీప్వం టి కార్యక్రమాల్లో ప్రజలు చురుకుగా పాల్గొని మంగళగిరి–తాడేపల్లిని ఆదర్శవంతమైన పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దాలని ఆమె పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా కమిషనర్ శ్రీ ఎస్. అలీం బాషా మాట్లాడుతూ నగర పరిశుభ్రతలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుండి తడి–పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని, రోడ్లపై చెత్త వేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలను కోరారు.“ఆపరేషన్ క్లీన్ స్వీప్” కార్యక్రమాన్ని ప్రజలు తమ సొంత కార్యక్రమంగా భావించి చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ముఖ్యంగా నగర పాలక సంస్థ పరిధిలో ప్రతి ఇంటి నుండి పుష్ కార్ట్  ఆటోల ద్వారా చెత్త సేకరణ జరుగుతున్నప్పటికీ,కొన్ని వాణిజ్య వ్యాపార ప్రాంతాలలో ఇంకా చెత్తను రోడ్లపై, షాపుల ముందు వేయడం జరుగుతోందని తెలిపారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొని భారీ జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమీషనర్ శ్రీకాంత్,అసిస్టెంట్ కమీషనర్ శ్రీనివాసరావు,రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి ఆకుల జయసత్య, ఆకుల ఉమా మహేశ్వర రావు, యెర్రబాలెం టీడీపీ నాయకులు,తాడేపల్లి టీడీపీ పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట రావు,మరియు కూటమి నాయకులు,నగరపాలక సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular