బీఆర్ఎస్ పార్టీ బీఎల్‌ఏలు, ప్రతి కార్యకర్తకు అభినందనలు. తెలిపిన
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి..
మన ప్రజావాణి మెదక్ ప్రతినిధి జూలై 28.
మెదక్ నియోజకవర్గంలో సార్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో 99.61 శాతం నమోదు సాధించడం వెనుక బీఆర్ఎస్ పార్టీ బీఎల్‌ఏల సమిష్టి కృషి, అంకితభావమే ప్రధాన కారణమని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. పార్టీ తరఫున బీఎల్‌ఏలుగా బాధ్యతలు నిర్వహించి ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరును కలిసి నమోదు ప్రక్రియను విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు అభినందనలు, ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమీక్ష సమావేశాలు, అవగాహన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తించిన బీఎల్‌ఏల సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి ఓటరు నమోదు, వివరాల ధృవీకరణ, అవసరమైన సవరణలపై అవగాహన కల్పిస్తూ నిరంతరం శ్రమించడం వల్లే ఈ ఫలితం సాధ్యమైందన్నారు.పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ గారి ఆదేశాల మేరకు బీఎల్‌ఏలు పూర్తి బాధ్యతతో పనిచేశారని కొనియాడారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు అధికారులతో సమన్వయం చేసుకుంటూ నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంలో విశేష సహకారం అందించారని తెలిపారు. గ్రామాలు, పట్టణాల్లో ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలవడం, అవసరమైన పత్రాలపై అవగాహన కల్పించడం, సమస్యలను వెంటనే పరిష్కరించేలా కృషి చేయడం వల్లే 99.61 శాతం నమోదు సాధ్యమైందన్నారు.ఈ విజయంతో సంతృప్తి చెందకుండా 100 శాతం నమోదు లక్ష్యంగా ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాలని బీఎల్‌ఏలకు సూచించారు. ఇంకా నమోదు కాని అర్హులైన ఓటర్లను గుర్తించి వారి పేర్లు జాబితాలో చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు.
భవిష్యత్తులో కూడా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాల్లో ఇదే క్రమశిక్షణ, సేవాభావంతో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సర్ కార్యక్రమంలో 99.61 శాతం నమోదు సాధనకు కృషి చేసిన ప్రతి బీఎల్‌ఏ, పార్టీ నాయకుడు, కార్యకర్తకు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ బీఎల్‌ఏలు, ప్రతి కార్యకర్తకు అభినందనలు
RELATED ARTICLES




