పోరుమామిళ్ల పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డి.సి. గోవిందరెడ్డి గారికి బద్వేల్ డిపో జేఏసీ కమిటీ వినతి పత్రం సమర్పణ

పోరుమామిళ్ల జూలై 19 ప్రజావాణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు ఎమ్మెల్సీ శ్రీ డి.సి.గోవిందరెడ్డి ని బద్వేల్ డిపో జేఏసీ కమిటీ నాయకులు,ఆర్టీసీ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలు,డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా ఆర్టీసీ పరిరక్షణ,ఉద్యోగుల సంక్షేమం,ప్రయాణికులకు మెరుగైన రవాణా సేవలు అందించే అంశాలపై ఎమ్మెల్సీ తో సుదీర్ఘంగా చర్చించారు.ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఎలక్ట్రిక్ బస్సులను పూర్తిగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని,వాటి నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించకుండా ఆర్టీసీ సిబ్బందితోనే కొనసాగించాలని కోరారు.అదేవిధంగా ఆర్టీసీ సంస్థను మరింత...