📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
HomeతెలంగాణMuluguపుట్టిన గంటలోపు ముర్రుపాలు తప్పనిసరి గోవిందరావుపేట పస్రా రాంపురం లో తల్లిపాల వారోత్సవాలు

పుట్టిన గంటలోపు ముర్రుపాలు తప్పనిసరి గోవిందరావుపేట పస్రా రాంపురం లో తల్లిపాల వారోత్సవాలు

📰 Generate e-Paper Clip

పుట్టిన గంటలోపు ముర్రుపాలు తప్పనిసరి
.గోవిందరావుపేట పస్రా రాంపురం లో తల్లిపాల వారోత్సవాలు.

గోవిందరావుపేట/ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్‌ (ప్రజావాణి)

ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా గోవిందరావుపేట మండలం పస్రా రాంపురం అంగన్వాడి కేంద్రం 5వ సెంటర్ లో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ A. జ్యోతి మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు తప్పనిసరిగా తాగించాలని సూచించారు.
ఆ పాలు పసుపు రంగులో ఉంటాయని, అవి తాగడం వలన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. అలాగే తల్లికి రొమ్ము క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయని అవగాహన కల్పించారు.
కార్యక్రమం అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డబ్బా పాలు వద్దు – అమ్మ పాలు ముద్దు అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ జ్యోతి, ఆయా సౌజన్య, గర్భిణీలు, బాలింతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular