📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్సగిలి పుల్లయ్య ప్రథమ వర్ధంతి వేడుకలు: కళారంగానికి ఆయన సేవలు చిరస్మరణీయం*

సగిలి పుల్లయ్య ప్రథమ వర్ధంతి వేడుకలు: కళారంగానికి ఆయన సేవలు చిరస్మరణీయం*

📰 Generate e-Paper Clip

కాశీనాయన ఆగస్టు 4 ప్రజావాణి మండలం,అమగంపల్లి సమీపంలోని బాలమ్మ వృద్ధాశ్రమంలో రాష్ట్ర హంస అవార్డు గ్రహీత, దివంగత చెక్కభజన గురువు సగిలి పుల్లయ్య ప్రథమ వర్ధంతి వేడుకలను ఆయన శిష్యులు ఘనంగా నిర్వహించారు.భజన గురువు సావిశెట్టిపల్లె పెద్దుల్లపల్లె శేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పుల్లయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆశ్రమ వృద్ధులకు బ్రెడ్లు పంపిణీ చేసి మానవత్వాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా సావిశెట్టిపల్లె శేఖర్ మాట్లాడుతూ.సగిలి పుల్లయ్య కేవలం ఒక కళాకారుడే కాదని, జానపద కళారంగాన్ని నమ్ముకుని ఎందరికో ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. తన జీవితాన్ని చెక్కభజన కళాభివృద్ధికే అంకితం చేశారని గుర్తుచేశారు. రాష్ట్ర స్థాయిలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న ఆయన. తన శిష్యుల రూపంలో ఎందరో కళాకారులను తీర్చిదిద్దారని పేర్కొన్నారు. పుల్లయ్య భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన నేర్పిన కళా సంస్కృతి ద్వారా ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతారని భావోద్వేగంతో తెలిపారు.ఈ సేవా కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మేక రవి,మేక చంటి,మేక సుధాకర్, ప్రశాంత్,ఎస్. ఓబులేసుతదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular