📄 ePaper
Tuesday, August 4, 2026
📄 ePaper
Homeఎడిటోరియల్ప్రజావాణి దిననపత్రిక కథనానికి స్పందన.. గుగ్గిళ్లలో వెలిగిన వీధి విద్యుత్ దీపాలు

ప్రజావాణి దిననపత్రిక కథనానికి స్పందన.. గుగ్గిళ్లలో వెలిగిన వీధి విద్యుత్ దీపాలు

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, ఆగస్టు 4 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గుగ్గిళ్ల గ్రామం 2వ వార్డులో వీధి విద్యుత్ దీపాలు వెలగక ప్రజలు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రజావాణి తెలుగు దినపత్రికలో సోమవారం ప్రచురితమైన కథనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించారు.
ఈ సమస్యను వెలుగులోకి తీసుకువచ్చిన ప్రజావాణి బెజ్జంకి మండల రిపోర్టర్ రాజశేఖర్ రెడ్డికి స్థానిక ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రజావాణి కథనానికి స్పందించిన గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య వెంటనే విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు. అనంతరం విద్యుత్ శాఖ సిబ్బంది గ్రామంలోని పాడైన వీధి విద్యుత్ దీపాలను మరమ్మతు చేసి తిరిగి వెలిగేలా చేశారు.దీంతో 2వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన ప్రజావాణి దినపత్రికకు, స్పందించి సమస్యను వెంటనే పరిష్కరించిన గ్రామ సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్యకు, విద్యుత్ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular