పుట్టిన గంటలోపు ముర్రుపాలు తప్పనిసరి గోవిందరావుపేట పస్రా రాంపురం లో తల్లిపాల వారోత్సవాలు
పుట్టిన గంటలోపు ముర్రుపాలు తప్పనిసరి .గోవిందరావుపేట పస్రా రాంపురం లో తల్లిపాల వారోత్సవాలు. గోవిందరావుపేట/ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి) ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా గోవిందరావుపేట మండలం పస్రా రాంపురం అంగన్వాడి కేంద్రం 5వ సెంటర్ లో కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి టీచర్ A. జ్యోతి మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు గంటలోపు ముర్రుపాలు తప్పనిసరిగా తాగించాలని సూచించారు. ఆ పాలు పసుపు రంగులో ఉంటాయని, అవి తాగడం వలన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. అలాగే...