📄 ePaper
Friday, July 31, 2026
📄 ePaper
HomeతెలంగాణYadadri Bhuvanagiriపట్టాలు ఇచ్చారు ప్లాట్లు ఎక్కడ

పట్టాలు ఇచ్చారు ప్లాట్లు ఎక్కడ

📰 Generate e-Paper Clip

*పట్టాలు ఇచ్చారు..ప్లాట్లు ఎక్కడ…?*


*సుందరయ్య భవనంలో భూ పోరాట కమిటీ సమావేశం.*


*ప్లాట్లు విషయంలో అధికారుల నిర్లక్ష్యం.*


*సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ.*


*జులై 29 మన ప్రజావాణి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి పెంట బాలరాజు*


పట్టాలిచ్చిన వారికి 700 సర్వే నెంబర్లు  భూమిని చదును చేయడంలో మాట తప్పిన అధికారుల 
700 సర్వే నెంబర్లు పట్టా లిచ్చి సం//రాలు గడుస్తున్నా ప్లాట్లు చూపించడంలో అధికారుల నిర్లక్ష్యం ఎందుకని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ ప్రశ్నించారు. బుధవారం రోజు  సిపియం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య భవనంలో భూ పోరాట కమిటీ సమావేశం గంధమల్ల మాతయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం లో రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ పాల్గొని మాట్లాడుతూ గత సంవత్సరం 700 సర్వే నెంబర్ లో పట్టాలు ఇచ్చిన వారందరూ ఆ స్థలంలో గుడిసెలు వేసు కున్నారు. అధికారులు నెల రోజులలో స్థలాలు చూపిస్తామని హామీ ఇవ్వడంతో అక్కడ గుడిసెలు వేసుకున్న వారంతా తీసివేయడం జరిగింది. సంవత్సరం నడుస్తున్నప్పటికీ ఎలాంటి భూమిని చదును చేయక పోవడం మాట తప్పిన అధికారుల పని అన్నారు. వారం రోజులలో భూమిని చదును చేసి ఫ్లాట్లు చూపించడంలో నిర్లక్ష్యం వహిస్తే గుడిసె వాసుల పోరాట కమిటీలో సమావేశంలో మరల గుడిసెలు వేస్తామని అన్నారు. భువనగిరి పట్టణంలోని అనేకమంది నిరుపేదలు ఇల్లు లేక కిరాయి ఇండ్లలో ఉండి కుటుంబంలో ఎవరైనా మరణించినచో ఇంటి ముందు శవాన్ని వెయ్య కుండా స్మశాన వాటికి నేరుగా తీసుకపోవడంతో చాలా బాధ కలిగిస్తుంది. ఈ పోరాటాన్ని ప్లాట్లు ఇచ్చేంతవరకు దశల వారీగా ఉద్యమిస్తామని అన్నారు. ఈ కార్య క్రమంలో సిపిఐఎం పట్టణ కార్యదర్శి మాయ కృష్ణ , సిపిఐఎం పట్టణ కార్యదర్శి కార్యవర్గ సభ్యులు బందెల ఎల్లయ్య , వనం రాజు , కమిటీ సభ్యుడు వలదాస్ అంజయ్య , చింతల శివ , కొత్త లక్ష్మయ్య , లలిత భూ పోరాట కన్వీనర్ దొడ్డి శంకర్ , కో కన్వీనర్ నార కలమ్మ , పిట్టల చంద్రశేఖర్ ,  కన్యబోయిన అరుణ , స్రవంతి , నాగమణి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular