
బద్వేల్ (జూన్ 06) ప్రజావాణి పెండ్లిమర్రి మండలం మిట్టమీద పల్లె గ్రామానికి చెందిన టంగుటూరు సుభాన్ చొరవతో, షాజిద్ రెండో పుట్టినరోజు వేడుకలు మానవతా సేవగా మారాయి.బద్వేల్ పట్టణం తెలుగు గంగా కాలనీలోని నిరాశ్రయుల వసతి గృహంలో చాన్ బాషా,అబ్దుల్ రహీం,సుహైల్ అహ్మద్ సమక్షంలో నిత్యవసర సరుకులు, మజ్జిగ వితరణ కార్యక్రమం నిర్వహించారు. సుభాన్, రమీజా దంపతుల కుమారుడు షాజిద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. పుట్టినరోజు సంబరాలను వ్యక్తిగతంగా జరుపుకోకుండా, అవసరంలో ఉన్నవారికి చేయూతనివ్వడం ద్వారా వేడుకకు అర్థం చేకూర్చారని స్థానికులు అభినందించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారు చిన్నారి షాజిద్‌కు ఆశీర్వాదాలు తెలియజేశారు. ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా పుట్టినరోజులను జరుపుకోవడం ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తుందని నిర్వాహకులు పిడతల రవి తెలిపారు.




