ఘట్కేసర్ జూన్ 6 : జన హృదయ నేత ఏనుగు సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఘట్కేసర్ మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి చెల్లక శ్రీధర్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. సుదర్శన్ రెడ్డి కోరుకున్న విధంగా హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటుగా పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు తదితర విద్యా సామగ్రిని సుదర్శన్ రెడ్డికి అందజేశారు. ఈ విద్యా సామగ్రిని అవసరమైన విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా పంపిణీ చేయాలని కోరారు.
ఈ సందర్భంగా చెల్లక శ్రీధర్ మాట్లాడుతూ, ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఏనుగు సుదర్శన్ రెడ్డి ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండి ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు బుద్ది శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు గొంగళ్ళ బాలేష్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు పవన్ రెడ్డి, ఘట్కేసర్ బీజేవైఎం అధ్యక్షుడు కొమ్మిడి విక్రాంత్ రెడ్డి, ఉమ్మడి ఘట్కేసర్ మండల కార్యదర్శి రమేష్ నాయుడు, నాయకులు గుండె నరేష్, శ్యామ్ రెడ్డి, వంశీ, అశోక్, నరేష్ తదితరులు పాల్గొని సుదర్శన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఏనుగు సుదర్శన్ రెడ్డి సేవా కార్యక్రమాలు అందరికీ ఆదర్శమని కొనియాడారు. జన్మదిన వేడుకలను సామాజిక సేవతో ముడిపెట్టి పేద విద్యార్థులకు ఉపయోగపడే విద్యా సామగ్రిని అందించడం అభినందనీయమని పేర్కొన్నారు.



