నియోజకవర్గ లోని ప్రజలు సుభిక్షంగా ఉండాలి కొండగట్టు లోప్రత్యేక పూజలువొడితల ప్రణవ్
– కొండగట్టులో ఘనంగా గిరిప్రదక్షిణ
* వర్షాలు సమృద్ధిగా కురవాలనికొండగట్టు అంజన్నను మొక్కుకున్న ప్రణవ్
* వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సాగిన గిరిప్రదక్షణ
* రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్అడ్లూరి లక్ష్మణ్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
* ఎమ్మెల్యే సంజయ్ మున్నూరు కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు బొమ్మ శ్రీరామ్
జమ్మికుంట జులై 29 (ప్రజావాణి)
రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలనిరైతులకు ఎల్ నీ నో నుండి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలనినియోజవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కొండగట్టు అంజన్నను వేడుకున్నారు.బుధవారం రోజున కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుచొప్పదండి శాసన సభ్యుడు మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నిర్వహించిన కొండగట్టు గిరిప్రదక్షణలో ఆయన పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్అడ్లూరి లక్ష్మణ్,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్,జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్,మున్నూరు కాపు కార్పొరేషన్ అధ్యక్షుడు బొమ్మ శ్రీరామ్ హాజరయ్యారు.వర్షం సైతం లెక్కచేయకుండాగిరి ప్రదక్షణ రోజే భారీవర్షం పడడంతో భక్తులుకార్యకర్తలు ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగిందనిఆ స్వామి నామస్మరణతో ప్రదక్షణ పూర్తిచేశారు.అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అంజన్న అనుగ్రహం ప్రజలందరిపై,రైతులపై ఉండి,రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురవాలని,పాడి పంటలతో హుజూరాబాద్ నియోజకవర్గం సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఎల్ నీ నో పై వాతావరణ శాస్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే కౌశిక్ రెడ్డి మాత్రం కరువు కాంగ్రెస్ తెచ్చిందని మాట్లాడడం కౌశిక్ రెడ్డి అవివేకానికి నిదర్శనమని,తానే శాస్రవేత్తలాగా మాట్లాడడం సిగ్గు చేటని,ప్రజలను ఇబ్బంది పెట్టేపనుల్లో బిఆర్ఎస్ నాయకులు మొదట ఉంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ నుండి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు





