
ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ శాఖంబరి నవరాత్ర మహోత్సవాలు
* శాకంబరి నవరాత్ర మహోత్సవాలకు మహా ముగింపు
* సంపూర్ణ శాఖంబరిగా భద్రకాళి అమ్మవారు
* భద్రకాళి అమ్మవారుసంపూర్ణ శాఖంబరిగా భద్రకాళి అమ్మవారు
* సంపూర్ణ శాఖంబరి గా అమ్మసంపూర్ణ శాఖంబరి గా భద్రకాళి అమ్మవారి దివ్య దర్శనం
* నైం నగర్ జాగృతి కాలనీ నుండి భద్రకాళి సేవాసమితి సభ్యులు 40మంది భద్రకాళి అమ్మ వారికి కూరగాయలు సమర్పించడం జరిగింది
* 15 రోజులపాటు వైభవంగా కొనసాగిననేటితో ముగియనున్నాయి
* సుమారు 40 రకాల కూరగాయలు 22 రకాల పండ్లతో సంపూర్ణ శాఖంబరిగా అలంకరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు
జమ్మికుంట జులై 29 ( ప్రజావాణి)
ప్రసిద్ధ శ్రీ భద్రకాళి దేవస్థానంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీ శాఖంబరి నవరాత్ర మహోత్సవాలు నేటితో ముగియనున్నాయిమహోత్సవాల 15వ రోజు సందర్భంగా అమ్మవారిని సంపూర్ణ శాఖంబరి దేవిగా అద్భుతంగా అలంకరించారు ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకోగా తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారి దివ్య దర్శనంపొందుతున్నారుశాకంబరి దేవి అన్నపూర్ణ స్వరూపిణిగా భూమిపై సస్యసమృద్ధిని ప్రసాదించే దైవంగా భక్తులు విశ్వసిస్తారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పంట పొలాలు పచ్చని పంటలతో కళకళలాడాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ 15 రోజులపాటు ప్రత్యేక పూజలు, అర్చనలు, హోమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా అమ్మవారిని సుమారు 40 రకాల కూరగాయలు, 22 రకాల పండ్లతో అద్భుతంగా అలంకరించారు. ఈ అలంకరణ కోసం అవసరమైన కూరగాయలు, పండ్లను బెంగుళూరు, సికింద్రాబాద్ మోండా మార్కెట్, గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్ నుంచి ప్రత్యేకంగా కొనుగోలు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఉదయం 10 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పిస్తున్నారు. అమ్మవారి దివ్య రూపాన్ని దర్శించుకునేందుకు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవదాయ శాఖ, ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు, ప్రసాదాల పంపిణీ, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ వంటి అన్ని ఏర్పాట్లను సమన్వయంతో నిర్వహిస్తున్నారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.శాకంబరి నవరాత్ర మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు మహామంగళహారతి తీర్థప్రసాదాల పంపిణీ నిర్వహించనుండగాఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు




