జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన సమావేశం
* ఇల్లంతకుంటపాఠశాలలో సుప్రీంకోర్టు వారిచే ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీ
* సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ క్రాంతి కుమార్
* ఇల్లందకుంట గ్రామ సర్పంచ్ దార సురేష్
* పాఠశాలప్రధానోపాధ్యాయులు తస్మైన్ నస్మీన్ మండల విద్యాధికారి కె. రాములు ఉపాధ్యాయులు కె. జయ
జమ్మికుంట జులై 29 (ప్రజావాణి)
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇల్లందకుంటలో సుప్రీంకోర్టు వారిచే ఏర్పాటుచేసిన ప్రత్యేక కమిటీచే రోడ్డు భద్రత అవగాహన సమావేశాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు రోడ్డు భద్రతకుటుంబ భద్రత గురించి చక్కగా అవగాహన కల్పించడం జరిగిందిఇట్టి కార్యక్రమంలో విచ్చేసినటువంటి ఎన్. ధనరాజ్ గౌడ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రోడ్ సేఫ్టీ మాట్లాడుతూ ప్రతిరోజు మన జిల్లా కరీంనగర్లో అనేకమైనటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఎంతోమంది చనిపోతున్నారని తెలియజేస్తూ ప్రతి విద్యార్థి వారి తల్లిదండ్రులకు రోడ్ భద్రత గూర్చి పూర్తిగా అవగాహన కల్పించాలని మీ తల్లిదండ్రులు సైకిల్ మోటార్ పై వెళ్లినప్పుడు హెల్మెట్ ధరించాలని కారులో వెళ్ళినప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా ఉపయోగించాలని రోడ్డు భద్రత విషయాలపై చక్కగా అవగాహన కలిగి ఉండాలని అలాగే మీ తల్లిదండ్రులకు తెలియజేయాలనిచెప్పారుకుటుంబ పెద్ద కోల్పోయినట్లయితే పిల్లలు అతని యొక్క సతీమణి చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాహనం నడిపినప్పుడు తాగి నడపకూడదని చాలా చక్కగా రోడ్డుపై ప్రయాణించి సురక్షితంగా ఇంటికి చేరుకోవాలని అప్పుడే వారి పిల్లలు ఒక చక్కటి జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారని విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగినదిప్రసాద్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మాట్లాడుతూ రోడ్డుపై వాహనాలు నడిపినప్పుడు తల్లిదండ్రులు చక్కటి డ్రైవింగ్ చేయాలని 18 సంవత్సరాల లోపు విద్యార్థులు ఎవరు కూడా వాహనాలు నడపరాదని విద్యార్థులకు ఈ విధంగా అవగాహన కల్పించడం జరిగిందిఇల్లందకుంట సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ క్రాంతి కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ఎవరైతే 18 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపరాదని ఇంటిదగ్గర వారి తల్లిదండ్రులకు వాహనాల గురించి రోడ్డు భద్రత గురించి వాహనం నడుపుతున్నప్పుడు చక్కటి డ్రైవింగ్ చేయాలని హెల్మెట్ తప్పకుండా ధరించాలని హెల్మెట్ ధరించినట్లయితే మన యొక్క తల సురక్షితంగా ఉంటుందని మన ఇంటి పెద్ద చక్కగా జీవించి ఉంటాడని అలాగే కార్లో ప్రయాణిస్తున్నటువంటి వారు సీటు బెల్టు ధరించాలని అప్పుడు మాత్రమే మన కుటుంబము చాలా సురక్షితంగా ఉంటుందని తెలియజేశారుఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తస్మైన్ నస్మీన్ మండల విద్యాధికారి కె. రాములు ఇల్లందకుంట గ్రామ సర్పంచ్ దార సురేష్ ఉపాధ్యాయులు కె. జయ ప్రకాష్ సిహెచ్. వేణు కే. శంకర్ ఎం. సమిరెడ్డికేసత్యనారాయణ జి. అన్నపూర్ణ జె. రాధికా రాణి ఏ. సురేష్ డి ఉమాదేవి ఎం ఐలయ్య సిహెచ్ రామకృష్ణ డి పరమేశ్వర్ వనిత దేవేందర్ స్రవంతి విశ్వతేజ విద్యార్థులు పాల్గొన్నారు
జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన సమావేశం
RELATED ARTICLES




