నిబంధనలకు తూట్లూ పొడుస్తూ 111 జీ ఓ లో అక్రమ కన్వెన్షన్ హాల్ నిర్మాణం…
– ప్రభుత్వ అనుమతులు ఉన్నాయా? లేవా ?అనే సందేహాలు
– నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఎప్పుడు?
షాబాద్//,జూన్ 08
( ప్రజావాణి )
షాబాద్ మండలంలోని మద్దూరు గ్రామం
111 జీఓ పరిధిలో ఎస్ వి కన్వెన్షన్ హాల్ కొనసాగుతుండటంపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.అనుమతులు, నిబంధనలు పాటించకుండా ఎస్ వి కన్వెన్షన్ హాల్ నిర్మాణం చేపడుతున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అమలులో ఉన్న నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణాలు సాగుతున్నా అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఈ విషయంపై సంబంధిత శాఖలు వెంటనే విచారణ చేపట్టి, నిర్మాణానికి సంబంధించిన అనుమతులను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుని నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా కూడా
మద్దూర్ గ్రామ పంచాయతీకి మాత్రం సంవత్సరానికి 75000 వె రుపాయలు
టాక్సీ ఇస్తున్నాను ఇస్తారని గ్రామపంచాయతీ కార్యదర్శి దుర్గాప్రసాద్ చెప్పారు.
ఎమ్మార్వో వివరణ
షాబాద్ మండలంలోని
మద్దూరు గ్రామంలో ఎస్ వి కన్వెన్షన్ హాల్ సంబంధించి వస్తున్న ఆరోపణలపై మండల తహసీల్దార్ (ఎంఆర్ఓ) స్పందించారు. సంబంధిత నిర్మాణానికి అవసరమైన అనుమతులు, పత్రాలపై పరిశీలన జరుగుతోందని తెలిపారు.111 జీఓ నిబంధనల ఉల్లంఘనపై ఫిర్యాదులు అందినట్లయితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం జరిగినట్లు తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎంఆర్ఓ స్పష్టం చేశారు.ప్రభుత్వ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించినా ఉపేక్షించబోమని, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తామని తెలిపారు. విచారణ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఎంఆర్ఓ పేర్కొన్నారు.






