📄 ePaper
Friday, July 31, 2026
📄 ePaper
HomeతెలంగాణYadadri Bhuvanagiriధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం

ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం

📰 Generate e-Paper Clip

*ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం…*


*పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి.*


*జులై 29 మన ప్రజావాణి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి పెంట బాలరాజు.*


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెంకటాపూర్ గ్రామంలోని శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్య క్రమానికి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేవస్థాన ధర్మకర్తల మండలి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన తుమ్మల శ్రీనివాస్ కి సభ్యులకి స్థానిక ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. నూతన ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అభివృద్ధి , భక్తులకు మెరు గైన సౌకర్యాల కల్పనతో పాటు దేవస్థాన ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంపొందించేందుకు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. అనంతరం శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో , ఆయు రారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్య క్రమంలో వలిగొండ పిఎసిఎస్ చైర్మన్ గరిసె రవి , మండల కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని సహాదేవ్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాశం సత్తి రెడ్డి , మాజీ జడ్పీటీసీ వాకిటి పద్మ అనంతరెడ్డి , మాజీ ఎంపీపీ చిట్టెడి జనార్దన్  రెడ్డి , సీనియర్ కాంగ్రెస్ నాయకులు ,  ధర్మకర్తల మండలి సభ్యులు , అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular