📄 ePaper
Saturday, June 13, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriతాగునీటి సమస్యను పరిష్కరించండి డిసి వాణికి వినతి పత్రం సమర్పించిన వినోద్

తాగునీటి సమస్యను పరిష్కరించండి డిసి వాణికి వినతి పత్రం సమర్పించిన వినోద్

📰 Generate e-Paper Clip

మేడ్చల్ జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని డిప్యూటీ కమిషనర్ వాణి కి వినతి పత్రం సమర్పించిన మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కే వినోద్. తను మాట్లాడుతూ ఘట్కేసర్ సర్కిల్లో బావులు బోర్లు ఎండిపోయి మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా రాకపోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, మున్సిపల్ అధికారులు అవసరమైన చోట బావులు బోర్లు వేయడం గాని, నీళ్ల ట్యాంకర్లతో నీళ్లు సప్లై చేయలని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎర్ర రాజు, బి ఆంజనేయులు, రవి పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular