📄 ePaper
Thursday, July 2, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్షూటింగ్ ను తలపిస్తున్న చంద్రబాబు పర్యటన - కాకాణి

షూటింగ్ ను తలపిస్తున్న చంద్రబాబు పర్యటన – కాకాణి

📰 Generate e-Paper Clip

నెల్లూరు జిల్లా, జూలై 02 ప్రజావాణి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి  జిల్లాకు ముఖ్య‌మంత్రి వ‌స్తున్నాడంటే సంక్షేమ,అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ప్రారంభించ‌డం జ‌రుగుతుంది.కానీ దానికి భిన్నంగా సీఎం చంద్ర‌బాబు నెల్లూరు ప‌ర్య‌ట‌న సాగింది.రెండేళ్ల చంద్ర‌బాబు పాల‌న చూస్తే ప‌నుల క‌న్నా ప‌బ్లిసిటీలు,ఈవెంట్‌ల‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాడు. ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం క‌న్నా కెమెరాల ముందు న‌ట‌న‌లే ఎక్కువైపోయాయి.ప్ర‌తినెలా ఒక‌టో తేదీ పింఛ‌న్ల పంపిణీ పేరుతో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని రావ‌డం,ఆ గ్రామంలో సెలెక్ట్ చేసుకున్న కుటుంబాన్ని క‌లిసి ఐదారు కెమెరాల ముందు త‌న న‌ట విశ్వ‌రూపం చూపిస్తాడు.గ‌తంలో కూడా చంద్ర‌బాబు ఒక‌సారి నెల్లూరు జిల్లాకు వ‌చ్చి మంట లేకుండా గ్యాస్ మీద వంట చేసి పోయాడు.పింఛ‌న్ల పంపిణీ కోసం వ‌స్తున్న చంద్ర‌బాబు రెండేళ్ల‌లో ఒక్క కొత్త పింఛ‌న్ ఇవ్వ‌లేదు స‌రిక‌దా,వైయ‌స్సార్సీపీ హ‌యాంలో ఇచ్చిన 6 ల‌క్ష‌ల పింఛ‌న్ల‌కు కోత పెట్టేశాడు.సూప‌ర్ సిక్స్ సూప‌ర్ సెవెన్ హామీలు అమ‌ల‌వుతాయా లేదా అని ప్ర‌జ‌లు అడుగుతున్నారు.ఒక కుటుంబానికి ఒక ఆటో ఇచ్చి పోతే,మిగ‌తా ల‌క్ష‌లాది కుటుంబాలను కూడా ఆదుకున్న‌ట్టేనా?జ‌గ‌న్ ని తిట్టే రాజ‌కీయాలు చేసే నాయ‌కుడొద్దు,మాకు న్యాయం చేసే నాయ‌కుడు కావాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే ముఖ్య‌మంత్రి కావాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు.చంద్ర‌బాబు లాంటి ఈవెంట్ మేనేజ‌ర్‌ని కాదు.పింఛ‌న్లు పంపిణీ చేయ‌డం అంటే ఒక కుటుంబం ముందు కెమెరాలు పెట్టి న‌టించ‌డం కాదు.షూటింగ్‌లు,సెట్టింగ్‌లు,ఈవెంట్లు,డ్రామాలు.. వీటితో ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular