కడప,జిల్లా మే14 ప్రజావాణి న్యూస్ కడప అల్ట్రా మెగా సోలార్ పార్క్ (1000 మెగావాట్లు) పరిధిలో స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి అధ్యక్షతన “4వ స్థానిక ప్రాంత అభివృద్ధి కమిటీ” సమావేశం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.సోలార్ పార్క్ పరిధిలో ప్రభావిత గ్రామాలు, ప్రభావితం కాని గ్రామాల అభివృద్ధికి ఇప్పటివరకు అందుబాటులోకి వచ్చిన నిధులతో చేపట్టిన పలు రకాల పనులు అమలులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇంకా అదనంగా ఉన్న నిధులతో గ్రామాల అవసరాలకు అనుగుణంగా సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు.పూర్తయిన పనులకు సంబంధించిన వినియోగ ధృవపత్రాలు వెంటనే సమర్పించాలని అమలు సంస్థలను కలెక్టర్ ఆదేశించారు.ఇప్పటివరకు విడుదల చేసిన నిధులకు సంబంధించి పనుల పురోగతి,నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పనులు పూర్తయిన వెంటనే యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించడం ద్వారా తదుపరి నిధుల విడుదల సులభతరం అవుతుందని చెప్పారు.మంజూరైన నిధులతో గ్రామ సచివాలయ సముదాయాల అభివృద్ధి,సీసీ రోడ్లు,గ్రావెల్ రోడ్ల కాంపౌండ్ వాల్లు,పార్కింగ్ టైల్స్,ప్లేగ్రౌండ్ లెవలింగ్,వెటర్నరీ భవనాల అభివృద్ధి వంటి పనులను చేపట్టేందుకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు.గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరే పనులను మాత్రమే ఎంపిక చేస్తున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు.ముఖ్యంగా రహదారులు,తాగునీరు,గ్రామ సచివాలయాలు,కమ్యూనిటీ భవనాలు,ఆరోగ్య సదుపాయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.సోలార్ ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలకు స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులతో సమాజానికి అవసరమయ్యే అభివృద్ధి పనుల కోసం డెవెలపర్స్ నుండి సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు.అందులో భాగంగా స్మార్ట్ కిచెన్ వ్యవస్థ కోసం 4 ఫుడ్ డెలివెరీ ట్రక్కులు,స్కిల్ డెవెలప్మెంట్ భవనాన్ని నిర్మించేందుకు ఆయా కంపెనీలు ముందుకొచ్చాయన్నారు.జమ్మలమడుగు ఎమ్మెల్యే ప్రతిపాదించిన పలు కొత్త అభివృద్ధి పనుల ప్రతిపాదనలు కూడా సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.ప్రభావిత గ్రామాలు,ప్రభావితం కాని గ్రామాల వారీగా ప్రతిపాదనలను పరిశీలించి కమిటీ ఆమోదం కోసం ఉంచినట్లు వెల్లడించారు.సోలార్ పార్క్ పరిధిలోని గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పారదర్శకంగా నిధులను వినియోగిస్తామని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సోలార్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎస్ఈ ఎం.శివశంకర్ నాయుడు, సీనియర్ ఇంజనీర్/సివిల్ అశోక్ కుమార్,సీపీవో హజరతయ్య, సోలార్ ప్రాజెక్టు డెవలపర్స్, తదితరులు పాల్గొన్నారు
Homeఆంధ్రప్రదేశ్కడప మెగా సోలార్ పార్క్ పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..4వ స్థానిక ప్రాంత అభివృద్ధి...
కడప మెగా సోలార్ పార్క్ పరిధిలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి..4వ స్థానిక ప్రాంత అభివృద్ధి కమిటీ” సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి
0
7
RELATED ARTICLES




