📄 ePaper
Monday, April 20, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్ఘనంగా బసవ జయంతి వేడుకలు. మఠం కోసం మంచి భవనాన్ని నిర్మిస్తాం..ఎమ్మెల్యే అమిలినేని

ఘనంగా బసవ జయంతి వేడుకలు. మఠం కోసం మంచి భవనాన్ని నిర్మిస్తాం..ఎమ్మెల్యే అమిలినేని

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ (ఏప్రిల్20) కళ్యాణదుర్గం ఎన్నో ఏళ్లుగా అన్ని ఆస్తులు ఉన్నా అవి అన్యాక్రాంతం కావడంతో విరక్తి గవి మఠం ఉత్తరాధికారి వస్తే ఉండటానికి సరైన వసతి లేదని ఎన్నికల ముందు తెలుపగ నేడు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు తన స్వంత నిధులతో భవనం నిర్మించేందుకు నేడు విరక్తి గవి మఠం ఉత్తరాధికారి కళ్యాణస్వామి సమక్షంలో ఎస్సార్సీ చైర్మన్ ముత్తినేని రాజగోపాల్,దేవినేని వెంకటేష్ వీర శైవ లింగాయతులతో కలసి ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు గారు భూమిపూజ చేశారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేడు చాలా శుభదినమని ఒక వైపు అందరూ సమానమే అంటూ ప్రతి ఒక్కరు సన్మార్గంలో నడవాలని తలచిన మహోన్నత్తుడు వీరశైవ లింగాయాతుల ఆరాద్యుడు బసవేశ్వరుడని నేడు 893వ జయంతి, అక్షయ తృతీయ,మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడుపుతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కూడా నేడే కావడం చాలా గొప్ప విషయమన్నారు.నేడు బసవేశ్వరుడి జయంతి సందర్బంగా నేడే భవనానికి భూమిపూజ చేయడం శుభపరిణామం అన్నారు త్వరలోనే భవనం పూర్తి చేస్తామని తెలిపారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular