కడపజిల్లాప్రజావాణి న్యూస్(ఏప్రిల్14)బద్వేల్ గోపవరం మండలం గోపవరం గ్రామపంచాయతీ నందు ప్రత్యేక గ్రామసభ కు అధ్యక్షత వహించిన స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో ఎం శ్రీధర్ పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ విజయ్ కుమార్ పర్యవేక్షణలో గ్రామపంచాయతీకి సంబంధించిన అజెండా లో తెలుపబడిన అంశాలపై చర్చించడం అయినది గోపవరం గ్రామపంచాయతీ కి జలధర జలహారతి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించిన జి పి మ్యాప్ వేయించి కార్యక్రమం జరపడమైనది అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం అయినది.అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ భారత రాజ్యాంగ రూపకర్త,సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానుభావుడు డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్నాం,అంబేద్కర్ గారు ఒక వ్యక్తి మాత్రమే కాదు,ఒక ఆలోచన.ఒక ఉద్యమం.ఒక మార్గదర్శి,చాలా కష్టాల మధ్య జన్మించిన ఆయన,విద్యనే ఆయుధంగా తీసుకుని ప్రపంచంలోనే గొప్ప పండితులలో ఒకరిగా ఎదిగారు. సమాజంలో ఉన్న అసమానతలు, అన్యాయాలు,అణచివేతలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయం.విద్య పొందండి,సంఘటితమవండి, పోరాడండి” అనే ఆయన సందేశం ఈ రోజుకీ మనకు మార్గదర్శకం.భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించి ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించడం ఆయన చేసిన గొప్ప సేవ.ముఖ్యంగా బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఆయన చేసిన కృషి అమూల్యం.అంబేద్కర్ గారి ఆశయాలను మనం పాటించడం అంటే•విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం•సమానత్వాన్ని కాపాడడం• అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడటం ఈ కార్యక్రమానికి ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు సచివాలయ సిబ్బంది మరియు జి పి లైన్ డిపార్ట్మెంట్స కు సంబంధించిన అధికారులు అందరూ హాజరు కావడం జరిగినది
Homeఆంధ్రప్రదేశ్గోపవరం గ్రామపంచాయతీ నందు ప్రత్యేక గ్రామసభ కు అధ్యక్షత వహించిన,, స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో
గోపవరం గ్రామపంచాయతీ నందు ప్రత్యేక గ్రామసభ కు అధ్యక్షత వహించిన,, స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీవో
0
6
Previous article
RELATED ARTICLES



