📄 ePaper
Tuesday, April 14, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్నీరాజనాలు అందుకున్న నిత్య స్మరణీయుడు డా బి ఆర్ అంబేద్కర్

నీరాజనాలు అందుకున్న నిత్య స్మరణీయుడు డా బి ఆర్ అంబేద్కర్

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్(ఏప్రిల్14)గుంటూరు నడిబొడ్డున అంబేడ్కర్ జయంతి కోలాహలం.జనసంద్రమైన లాడ్జి సెంటర్ క్రేన్‌తో భారీ గజమాల సమర్పణ.135 కేజీల కేక్ కట్ చేసిన మాజీ మంత్రి వర్యులు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ గారు చూపిన బాటలో నడవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మాజీ మంత్రి,వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు గారు పేర్కొన్నారు. నక్కా ఆనందబాబు యువసేన మరియు టిడిపి నేతల ఆధ్వర్యంలో గుంటూరు లాడ్జి సెంటర్‌లో అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి.క్రేన్ సహాయంతో భారీ గజమాలను అంబేడ్కర్ విగ్రహానికి వేసి నక్కా ఆనందబాబు గారు ఘనంగా నివాళులర్పించారు.అంబేడ్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకుని 135 కేజీల భారీ కేక్‌ను టిడిపి నేతలు,అభిమానుల మధ్య కట్ చేశారు.ఈరోజు దేశమంతా గర్వించదగ్గ మహనీయుడు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్135వ జయంతి వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకోవడం సంతోషంగా ఉంది.అంబేడ్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన వారు కాదు,ఆయన ఈ దేశ సంపదని బలహీన వర్గాలకు,దళితులకు,మహిళలకు రాజ్యాంగం ద్వారా ఆయన కల్పించిన హక్కులే నేడు అందరినీ గౌరవప్రదంగా బతికేలా చేస్తున్నాయని.భోధించు సమీకరించు పోరాడు’అన్న ఆయన పిలుపును మనం నిరంతరం గుర్తుంచుకోవాలని అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభ్యున్నతి కోసం చంద్రబాబు నాయుడు  ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు నేడు ఎస్సీలకు అండగా నిలుస్తున్నాయని.తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ అంబేడ్కర్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు.అంటరానితనం లేని,సమానత్వంతో కూడిన నవ సమాజాన్ని నిర్మించడమే అంబేడ్కర్ గారికి మనం ఇచ్చే నిజమైన నివాళిఅని.యువత ఆయన అడుగుజాడల్లో నడిచి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.నిత్యం ప్రజలచే కొనియాడదగిన నేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని తెలిపారు.కార్యక్రమంలో మాజీ క్రిస్టియన్ కార్పోరేషన్ ఛైర్మన్ మద్దిరాల మ్యానీ, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహణ కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు,టిడిపి రాష్ట్ర నాయకులు కొర్రపాటి సురేష్,కిరణ్,సౌపాటి రత్నం,టిడిపి ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి బోరుగడ్డ వెంకట్రావు, టిడిపి జిల్లా బిసి సెల్ అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్,ఆదివాసీల సంక్షేమ సంఘం అధ్యక్షుడు తిరువీధుల శంకర్ ప్రసాద్,టిడిపి నేతలు తప్పెట్ల ప్రదీప్,మంచాల చంద్రశేఖర్, తెనాలి శ్యామ్,తెనాలి రవికుమార్,ఉప్పలపాటి ముని,సింధు,నీలా రామకృష్ణ,దళిత సంఘాల నేతలు మురికి పూడి దేవపాల్,కర్రా ఆనోక్ బెంజమిన్,గోళ్ళ అరుణ్ కుమార్,తూమాటి చంద్రశేఖర్,నేలపాటి నాగభూషణం,బత్తుల వీరాస్వామి, తదితరులు పాల్గొన్నారు కార్యక్రమంలో భారీ సంఖ్యలో టిడిపి నాయకులు,దళిత సంఘాల నేతలు,నక్కా ఆనందబాబు యువసేన సభ్యులు మరియు అభిమానులు పాల్గొని జై భీమ్ నినాదాలతో లాడ్జి సెంటర్‌ను హోరెత్తించారు.కార్యక్రమం అంతా పండుగను తలపించేలా జనసందోహంతో నిండిపోయింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular