ఏనుగు సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పేద విద్యార్థులకు విద్యా సామగ్రి అందజేత

ఘట్కేసర్ జూన్ 6 : జన హృదయ నేత ఏనుగు సుదర్శన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఘట్కేసర్ మున్సిపల్ కార్పొరేషన్ 6వ డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి చెల్లక శ్రీధర్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. సుదర్శన్ రెడ్డి కోరుకున్న విధంగా హంగులు, ఆర్భాటాలకు దూరంగా ఉంటూ ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తోడ్పాటుగా పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు తదితర విద్యా సామగ్రిని సుదర్శన్ రెడ్డికి అందజేశారు. ఈ విద్యా సామగ్రిని...