కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే05) బద్వేల్ నియోజకవర్గ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కె.విజయమ్మ నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.దీనిలో భాగంగా పోరుమామిళ్ల మండలం,రంగసముద్రం పంచాయతీ పరిధిలోని కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన ఏలూరి సుభాషిణికి రూ.23,920 విలువ గల చెక్కును,అలాగే రాజాసాహెబ్ పేట గ్రామానికి చెందిన పఠాన్ మహబూబ్ ఖాన్‌కు రూ.25,000 విలువ గల చెక్కును అమ్మ స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి అందజేశారు. అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న ఈ ఆర్థిక సాయం కొండంత అండగా నిలుస్తోందని ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.ప్రతి ఒక్క బాధితుడికి ప్రభుత్వ సాయం త్వరితగతిన అందేలా మన కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ప్రజల కష్టాల్లో పాలుపంచుకోవడమే తమ లక్ష్యమని విజయమ్మ గారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ సాధనకారి రంతు,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ బసిరెడ్డి రవికుమార్ రెడ్డి వెంగమాంబ స్కూల్ అధినేత పుల్లపునాయుడు,ఎంపిటిసి రమణ, మాజీ మండల పార్టీ అధ్యక్షులు కొండ కృష్ణారెడ్డి, కడప పార్లమెంటు ఉపాధ్యక్షులు సీతా వెంకటసుబ్బయ్య,మాజీ సర్పంచ్ యనమల సుధాకర్ సొసైటీ చైర్మన్ కల్లూరు కృష్ణారెడ్డి,రాసాయిపేట భూపాల్ రెడ్డి,భాస్కర్ రెడ్డి,నారాయణరెడ్డి రంగసముద్రం సుబ్బారావు గురప్ప స్వామి టెంపుల్ చైర్మన్ మల్లికార్జున్రెడ్డి మరియు నియోజకవర్గ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎండను సైతం లెక్కచేయక.. బాధితుల ఇంటివద్దకే వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన విజయమ్మ
RELATED ARTICLES

