ఎండను సైతం లెక్కచేయక.. బాధితుల ఇంటివద్దకే వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన విజయమ్మ
కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే05) బద్వేల్ నియోజకవర్గ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, తీవ్రమైన ఎండలను సైతం లెక్కచేయకుండా మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి కె.విజయమ్మ నేరుగా లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ (CMRF) చెక్కులను పంపిణీ చేశారు.దీనిలో భాగంగా పోరుమామిళ్ల మండలం,రంగసముద్రం పంచాయతీ పరిధిలోని కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన ఏలూరి సుభాషిణికి రూ.23,920 విలువ గల చెక్కును,అలాగే రాజాసాహెబ్ పేట గ్రామానికి చెందిన పఠాన్ మహబూబ్ ఖాన్‌కు రూ.25,000 విలువ గల చెక్కును అమ్మ స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి...